రష్యా యూనివర్శిటీలో చైనీస్‌ లాంగ్వేజ్‌ కహానీ.. పోటీబడుతున్న విద్యార్థులు!

రష్యా యూనివర్శిటీలో చైనీస్‌ లాంగ్వేజ్‌ కహాని ఏమిటని ఆశ్చర్యంగా వుంది కదా.విషయం తెలుసుకోవాలంటే ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.

 Chinese Language Story In Russian University Students Competing, Chinese , Lates-TeluguStop.com

అవును, ఆల్‌ రష్యన్‌ చైనీస్‌ లాంగ్వేజ్‌ కాంపిటీషన్‌ ”చైనీస్‌ లాంగ్వేజ్‌ ఈజ్‌ ఎ బ్రిడ్జ్‌”( Chinese language is a bridge ) ఫైనల్స్‌ను మంగళవారం ఐఎస్‌యు (ఇర్కుట్స్క్‌ స్టేట్‌ యూనివర్శిటీ)లో నిర్వహించగా విశేష స్పందన వచ్చింది.ఈ సందర్భంగా ప్రాథమిక విద్యార్థుల నుండి సెకండరీ, హయ్యర్‌ విద్యార్థుల వరకు అన్ని వయస్సుల వారు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది.

Telugu Chinese, Language Story, Latest, Russian, Telugu Nri-Telugu NRI

అవును, చైనీయుల సంస్కృతి, చరిత్ర, భౌగోళిక అంశాలతో పాటు సాహిత్యంలో విద్యార్థుల ప్రతిభను ఈ సందర్భంగా వెల్లడిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీని ప్రాంతీయ, జాతీయ (రష్యన్‌), అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించబోతున్నారు.అంతర్జాతీయ స్థాయి( International level ) పోటీలు చైనాలో జరగనుండగా, చైనీస్‌ సెంట్రల్‌ టెలివిజన్‌( Chinese Central Television ) వీటిని లైవ్ టెలికాస్ట్ చేయనుంది.

Telugu Chinese, Language Story, Latest, Russian, Telugu Nri-Telugu NRI

ఈ నేపథ్యంలో, విజేతలు ”చైనీస్‌ భాష మరియు సంస్కృతికి వారసులు” అనే బిరుదును అందుకోనున్నారు.ఆల్‌ రష్యన్‌ పోటీ అనేది జాతీయ స్థాయి రౌండ్‌.విజేతలు రష్యాకు అంబాసిడర్‌గా వ్యవహరించే హక్కును కలిగి ఉంటారు.

ఇక విజేతలకు చైనాలోని ఏ యూనివర్శిటీలోనైనా ఉచిత విద్యను పొందేందుకు అవసరమైన సర్టిఫికేట్‌లను ఇక్కడ జారీ చేస్తారని మాస్కో స్టేట్‌ యూనివర్శిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ లాంగ్వేజ్‌ హెడ్‌ అయినటువంటి స్వెత్లానా ఈ సందర్భంగా పేర్కోవడం జరిగింది.చైనా భాష గురించి అందరికీ తెల్సిందే.

అదొక ప్రత్యేకమైన లిపి.ఈ ప్రపంచంలో కేవలం బొమ్మలతో ఓ లిపి రాయబడింది అంటే అది చైనా భాషయే అని చెప్పుకోవాలి.

అందుకే కొంతమంది ఔత్సాహికులు చైనా భాషను నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube