కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే అనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.
నాటి అలెగ్జాండ( Alexandar )ర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.
వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.
కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపద( Temples Wealth )ను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద.
విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కొందరి కృషి వల్ల అలాంటి అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.
ఈ క్రమంలోనే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్( Chhatrapati Shivaji Maharaj ) ఉపయోగించిన పులి గోళ్ల మాదిరిగా తయారు చేసిన ‘వాఘ్ నఖ్’’( Wagh Nakh ) అనే బాకు త్వరలోనే యూకే నుంచి భారతదేశానికి తీసుకురానున్నారు.1659లో బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్‌ను చంపేందుకు శివాజీ దీనిని ఉపయోగించాడు.ఈ బాకును ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియంలో వుంచారు.సతారా ఆస్థానంలో శివాజీ వారసులు ఈ ఆయుధాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్‌కు అందజేశారు.
తర్వాత దీనిని ఆయన బ్రిటన్ తీసుకెళ్లాడు.తదనంతరం డఫ్ వారసులు శివాజీ ఆయుధాన్ని మ్యూజియంకు విరాళంగా అందజేశారు.
అయితే మరాఠా ప్రజల మనోభావాలు, వారసత్వానికి , చరిత్రకు ప్రతీక అయిన ఈ వాఘ్ నఖ్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్( Maharashtra Cultural Affairs Minister Sudhir Mungantiwar ) ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ర ప్రభుత్వాల సాయంతో అక్కడి విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియం( Albert Museum )తో చర్చలు జరిపి అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ప్రయత్నాలు కొలిక్కిరావడంతో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు సుధీర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి లండన్( London )కు వెళ్లనున్నారు.