నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నా.. త్వరగా వచ్చే అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన ఛార్మి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో చార్మి( Charmy Kaur ) ఒకరు ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి హీరోలతో కలిసి సినిమాలలో నటించారు.అయితే ఇటీవల కాలంలో ఈమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసినదే.

 Charmi Emotional Post On Her Pet, Charmy Kaur ,pet Animal, Liger, Poori Jagan-TeluguStop.com

జ్యోతిలక్ష్మి ( Jyothi Lakshmi ) అనే సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం నిర్మాతగా మారి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు నిర్మాతగా చార్మి పూరి జగన్నాథ్ (Poori Jagannath) తో కలిసి పలు సినిమాలు నిర్మించారు.

ఈమె నిర్మించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడమేకాకుండా భారీ డిజాస్టర్లను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.ఇటీవల లైగర్( Liger ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ ఛార్మి ఇద్దరు కూడా భారీగా నష్టపోయారు.

ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ హీరో రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.</br

ఇదిలా ఉండగా తాజాగా ఛార్మి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈమె తన పెట్ అనిమల్ తో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ.రెండేళ్ల అవుతుంది నీవు నన్ను వదిలి వెళ్ళిపోయి నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను.నీ కౌగిలింతలను నీ ప్రేమను మర్చిపోలేక పోతున్నాను తిరిగి ఈ అమ్మ దగ్గరకు వచ్చేసేయ్ నీకోసం నీ అమ్మ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇలా చార్మి తన పెట్ కోసం ఇలా ఎమోషనల్ అయ్యారంటే ఈమె దానిని ఎంత ప్రేమగా చూసుకునేదో అర్థమవుతుంది.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube