తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ( Chiranjeevi ) ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు.అయితే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇకపోతే సినిమాలలో హీరోలు మాత్రమే కాకుండా కొన్ని గెస్ట్ పాత్రలలో ఇతర ప్రముఖులు కూడా నటిస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం అయినటువంటి సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు క్రికెట్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ( Crickets ) మానేస్తే ఎన్నో లక్షల మంది క్రికెట్ చూడడమే ఆపేసారు.ఆ రంగం లో ఆయన సృష్టించిన ప్రభంజనం, ఏర్పాటు చేసిన మార్క్ అలాంటిది.

ఇలా క్రికెట్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సచిన్ టెండుల్కర్ సినిమాలలో కూడా నటించారు అయితే ఈ విషయం చాలామందికి తెలియదు ముఖ్యంగా ఈయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి చిరంజీవి సినిమాలో నటించారు సచిన్ టెండూల్కర్ చిరంజీవి మధ్య మంచి అనుబంధము ఉంది.పలుమార్లు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాలో కూడా సచిన్ టెండూల్కర్ ఒక గెస్ట్ పాత్రలో నటించారని తెలుస్తుంది.

సచిన్ టెండుల్కర్, చిరంజీవి ఇద్దరు కలిసి నటించిన సినిమా ఏంటి అనే విషయాన్ని వస్తే.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా వెళ్లాలని ప్రయత్నాలు చేశారు అయితే అలియా భట్ తండ్రి మహేష్ భట్ ( Mahesh Bhatt )దర్శకత్వం లో, అప్పట్లో బాలీవుడ్ లో చిరంజీవి తో ఒక సినిమా ప్రారంభించాడు.ఈ సినిమాలో సచిన్ టెండూల్కర్ చిన్న గెస్ట్ రోల్ చేసాడట.క్రికెట్ నేపథ్యంలో వచ్చినటువంటి తరుణంలో ఆ పాత్రలో సచిన్ టెండూల్కర్ నటించారు.

ఇక ఈ సినిమా కొంతమేర షూటింగ్ పనులు జరుపుకున్నప్పటికీ అనంతరం ఈ సినిమా పూర్తిస్థాయిలో షూటింగ్ జరుపుకోలేకపోయింది.ఒక వ్యక్తి కాపీ రైట్ కేసు వెయ్యడం వల్ల మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.అలా అర్థాంతరంగా మధ్యలో ఆగిపోయిన ఈ సినిమా తర్వాత చిరంజీవి మళ్ళీ బాలీవుడ్ సినిమా చెయ్యలేదు.అలా చిరంజీవి సచిన్ టెండుల్కర్ కలిసి ఒక సినిమాలో నటించిన ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేకపోయింది
.






