ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ధర్మాసనం విచారించింది.ఇందులో భాగంగానే ఫైబర్ నెట్ కేసులో డిసెంబర్ 12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరగగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తరువాత ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడని నేపథ్యంలో విచారణను సుప్రీం ధర్మాసనం మరోసారి వాయిదా వేసింది.