పండుటాకులకు పండగలాంటి వార్త చెప్పిన బాబు !     2019-01-11   23:44:59  IST  Sai Mallula

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త కొత్త వరాలు ఇచ్చేందుకు అధికార టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫిభ్రవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ప్రజల మనసులు గెలవాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే …. సంక్రాత్రి కానుకగా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu Announced Doubling Of All Pentions In Ap-

Chandrababu Announced Doubling Of All Pentions In Ap

జనవరి నుంచే పెంచిన పింఛన్ చెల్లిస్తామన్నారు. జనవరికి సంబంధించిన పెన్షన్ ఇప్పటికే పంపిణీ చేశారు కాబట్టి.. పెంచిన పింఛన్ ఫిబ్రవరిలో అందజేస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఈ ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో సుమారు 50లక్షల మందికిపైగా పింఛన్ దారులకు లబ్ది జరుగుతుంది.