381 కట్స్ పడ్డాయి సన్నీ లియోన్ సినిమాకి

సినిమాలో రెండు మూడు కట్స్ పడితేనే గగ్గోలు పెడతారు దర్శకనిర్మాతలు, మరి అలాంటిది 381 కట్స్ ఒకే సినిమాకి పడితే ? అసలు సినిమా ఇంకెందుకు చూడాలి అనేంత విరక్తి కలుగుతోంది కదా.సెన్సార్ తీరుపట్ల చాలా మండే అసహన వ్యక్తం చేస్తున్నారు.

 Censor Board Harsh On Sunny Leone’s Mastizaade-TeluguStop.com

ఆ సినిమా పేరు మస్తిజాదే.సన్నీ లియోన్ హీరోయిన్.ఈ రోజే విడుదలైంది.

“రోజురోజుకి సెన్సార్ దారుణంగా ప్రవర్తిస్తోంది.సన్నీ లియోన్ సినిమా అంటే ఏం ఆశిస్తారో జనాలు వాళ్లకు తెలిదా ? వాటిని ఆధారం చేసుకొనే కదా నిర్మాతలు డబ్బులు పెట్టేది.సన్నీ సినిమాకి ఫ్యామిలిని పట్టుకొని రారు కదా థియేటర్ కి.మరింకెందుకు అభ్యంతరం.ఇలాంటి సినిమాలు నచ్చనివాళ్ళు ఎలాగో థియేటర్ కి రారు.

వచ్చినవారు సెన్సార్ బోర్డు చేసిన పనికి ఖచ్చితంగా నిరాశపడతారు.ఇవన్ని చేసి ఇచ్చింది ఏ సర్టిఫికేటే కదా” అంటూ వాఖ్యానించారు ఒక ట్రేడ్ పండితుడు

సినిమా ట్రైలర్ చూసి అతిగా ఆశపడి, థియేటర్లో కట్స్ దెబ్బకు ఈరోజు నుంచి ఎంతమంది బలవుతారో ఏదైనా సెన్సార్ బోర్డు అతిగా వ్యవహరిస్తున్నది మాత్రం కాదనలేని వాస్తవం.

ఏ సర్టిఫికేట్ సినిమాలని ఎవరు చూస్తారో ఎందుకు చూస్తారో అవగాహన ఉండీ కూడా ఇలా చేయడం ఏంటో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube