షాకింగ్‌ : అప్పుడే యూట్యూబ్‌లో ‘డిక్టేటర్‌’

సినిమాలు విడుదల అయిన రెండు మూడు రోజుల్లోనే పైరసీ అవుతున్నాయి.పైరసీ వల్ల వందల కోట్లను నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుంది.

పైరసీని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది.ముఖ్యంగా మీడియా పైరసీకి వ్యతిరేకంగా పోరాల్సి ఉంది.

కాని తెలుగు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ అయిన జెమిని టీవీ స్వయంగా పైరసీని ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తోంది.ఇటీవలే సంక్రాంతికి విడుదలైన ‘డిక్టేటర్‌’ చిత్ర పైరసీ ప్రింట్‌ను జెమిని టీవీ స్వయంగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసింది.నిన్న సాయంత్రం పూట ‘డిక్టేటర్‌’ చిత్రాన్ని యూట్యూబ్‌లో జెమిని టీవీ వారు పోస్ట్‌ చేశారు.12 గంటలు దాటక ముందే 3500 మంది చూశారు.అయితే ఏం జరిగిందో ఏమో కాని నేడు ఉదయానే ఆ పైరసీ సినిమాను తమ అకౌంట్‌ నుండి డిలీట్‌ చేయడం జరిగింది.

ప్రస్తుతం ‘డిక్టేటర్‌’ నిర్మాతలు జెమిని టీవీపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.జెమినిటీవీ పైరసీని అరికట్టాల్సింది పోయి ఏకంగా పైరసీ కాపీని తమ అధికారిక అకౌంట్‌లో పోస్ట్‌ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

Advertisement

దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని బాలయ్య అభిమానులు అంటున్నారు.మొత్తానికి ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా ఉంది.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు