రైడ్ క్యాన్సిల్ చేసిన క్యాబ్ డ్రైవర్.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు..!

ఓలా లేదా ఉబెర్‌లో రైడ్‌ను బుక్ చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది.అంతేకాదు, భారతదేశంలో రైడర్లు క్యాన్సిలేషన్లను, ఎక్కువసేపు వేచి ఉండటం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా చాలా కామన్.

 Cab Driver Who Canceled The Ride  Hats Off If He Knows The Reason , Cab Driver,-TeluguStop.com

అయితే ఇటీవల రైడర్, క్యాబ్ డ్రైవర్ మధ్య జరిగిన ఒక చాట్ చాలామంది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటుంది.ఈ చాట్‌లో కనిపించిన డ్రైవర్ నిజాయితీకి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Ashi (@ashimhta) అనే ట్విటర్ యూజర్ భరత్ అనే యాప్-క్యాబ్ డ్రైవర్‌తో జరిగిన చాట్ స్క్రీన్‌షాట్‌ను రీసెంట్‌గా పంచుకున్నారు.దీనిలో డ్రైవర్ భరత్ తాను చాలా స్లీపిగా అంటే నిద్రమత్తులో ఉన్నారని చెప్పాడు.

ఆపై ఆషిని రైడ్‌ను రద్దు చేయమని కోరాడు.

నిద్ర మధ్యలో ఉండి కూడా కొందరు డ్రైవర్లు రైడ్స్ యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు.

లేదంటే ఏదో ఒక కారణం చెప్పి రైడ్ క్యాన్సిల్ చేయమని అంటారు.అయితే ఈ డ్రైవర్ మాత్రం తాను స్లీపిగా ఉన్నట్లు నిజాయితీగా చెప్పేశాడు.

నిద్రమత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తే అటు ప్యాసింజర్ కే కాకుండా ఇతని ప్రాణాలకు కూడా ప్రమాదమే.అందుకే ఆషి ఆ రైడ్ క్యాన్సిల్ చేశారు.

తర్వాత రైడ్‌ని బుక్ చేసుకునే విషయంలో నిజాయితీయే ఉత్తమమైన పాలసీ అనిపిస్తుందని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Telugu @ashimhta, Bharat, Cab, Cab Rider, Chat-Latest News - Telugu

ఈ ట్వీట్ పోస్ట్ అయిన కొంత సమయంలోనే బాగా వైరల్ అయింది.ఈ పోస్ట్ కు ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ 5వేలకి పైగా లైక్‌లను వచ్చాయి.చాలా మంది వ్యక్తులు డ్రైవర్‌ బాధ్యతను ప్రశంసించారు.

డ్రైవర్ నిజాయితీతో కూడిన సమాధానం వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు.గత మేలో, పరాఠా తినడం మధ్యలో ఉన్నానని ఒక ఉబెర్ డ్రైవర్‌ సంభాషణ జరిపి అందరినీ నవ్వించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube