బుట్టబొమ్మ సినిమా విషయంలో త్రివిక్రమ్ హస్తం ఉందా.. ఆయన ఏం చెబుతున్నారంటే?

శౌరీ చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం బుట్ట బొమ్మ.అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో సూర్య వశిష్ట,అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు.

 Buttabomma Impress Trivikram Movie Director Interesting Comments , Buttabomma Mo-TeluguStop.com

ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Telugu Buttabomma, Saagar Chandra, Tollywood, Trivikram-Movie

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.సమయంలో కప్పేల సినిమాను చూశాను.అప్పుడు దాన్ని అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి రీమేక్ చేస్తే బాగుంటుందని నమ్మకం కలిగింది.

తరువాత అయ్యప్పను కోషియమ్ సినిమాను చూశాను.ఈ రెండు సినిమాలు చూసినప్పుడు తెలుగులో చేస్తే బాగుంటుందని అనిపించింది.

అయితే అప్పటికే ఆ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకొని అయ్యప్పను కోషియమ్ సినిమా రీమేక్ ను సాగర్ చంద్రతో ప్రకటించేశారు. కప్పెల రీమేక్ చేయబోతున్నారని తెలిసి ఎడిటర్ నవీన్ నూలి ద్వారా చిన్న బాబు వంశీని కలిసాను.

కొన్ని చర్చలు తిరిగిన తర్వాత నేను చేయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు చంద్రశేఖర్.

Telugu Buttabomma, Saagar Chandra, Tollywood, Trivikram-Movie

అందులో మెయిన్ పాయింట్ తీసుకొని తెలుగులో నేటివిటికి తగ్గట్టుగా చాలా మార్పులు చేశాము.ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్టాఫ్ లోకి మార్పులు చేయడం జరిగింది.సినిమాలో కామెడీ ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయి అని చెప్పుకొచ్చారు చంద్రశేఖర్.

ఏ సినిమా జోనర్ అయిన సంబంధం లేకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించ గలిగేలా సినిమా తీస్తే ఖచ్చితంగా ఆదరణ పొందుతుంది అని నేను నమ్ముతాను.ఫైనల్ గా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటేనే సినిమా విజయం సాధిస్తుంది.

సినిమా చూసిన తర్వాత నిర్మాత చిన్న బాబు గారు మెచ్చుకున్నారు.అలాగే త్రివిక్రమ్ కూడా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేయడం మరింత నమ్మకాన్ని పెంచింది అని చెప్పకు వచ్చారు దర్శకుడు చంద్రశేఖర్.

సినిమా చూసిన తర్వాత ఆ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేయమని చెప్పినట్లు తెలిపాడు దర్శకుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube