ఆ దేశ ప్ర‌ధాని తండ్రి త‌మ‌ను అక్క‌డ తాకాడంటున్న మ‌హిళా ఎంపీ

మ‌హిళ‌ల భ‌ద్ర‌త అనేది ఎక్క‌డైనా ప్ర‌శ్నార్థ‌కంగానే మారుతోంది.ఇప్పుడు ఏకంగా ఓ ప్ర‌ధాని తండ్రి మీదే ఆరోప‌ణ‌లు చేయ‌డం పెను సంచ‌ల‌నంగా మారిపోయింది.

 British Woman Mp Molestation Allegation On Pm Boris Johnson Father Details, Woma-TeluguStop.com

ప్ర‌స్తుత బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న‌టువంటి బోరిస్ జాన్సన్ తండ్రి అయిన స్టాన్లీ జాన్సన్ మీద ఓ మ‌హిళా ఎంపీ చేసిన ఆరోప‌ణ‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.అయితే ఆమె మాత్ర‌మే కాకుండా మ‌రి కొంద‌రు కూడా ఆయ‌న మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఈ దేశంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీలోనే ఎంపీగా ఉన్న క‌రోలిన్ నోక్స్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఆమె రీసెంట్ గా ఓ మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం గురించి వివ‌రించారు.

తాను 2003లో పార్టీకి సంబంధించిన‌టువంటి ఓ సదస్సులో పాల్గొన్న‌ప్పుడు స్టాన్లీ జాన్సన్ కూడా అక్క‌డ‌కు వ‌చ్చార‌ని అయితే తాను న‌డుచుకుంటూ వెళ్తున్న క్ర‌మంలో ఆయ‌న త‌న వెన‌కాలే వ‌చ్చార‌ని చెప్పింది.స‌డెన్ గా తన వెనుకవైపు గట్టిగా కొట్టార‌ని, పైగా త‌న సీటు లవ్ లీ గా ఉందంటూ చెప్ప‌డం షాక్ కు గురి చేసిందంటూ కరోలిన్ నోక్స్ చెప్పుకొచ్చారు.

ఈమె ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ లోని రామ్సీ సౌతాంప్టన్ ఎంపీగా ప‌నిచేస్తున్నార‌.పార్టీలో సీనియ‌ర్ కూడా.

Telugu Boris Johnson, Conservative, England Prime, London, Mp Carolin, Stanley J

ఇక ఈ ఎంపీ చేసిన ఆరోప‌న‌ల‌పై స్టాన్లీ జాన్సన్ స్పందించారు.కరోలిన్ నోక్స్ త‌మ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారని, కానీ ఆమె విష‌యం ఏమీ తనకు గుర్తులేదంటూ వివ‌రించారు.అయితే ఆయ‌న‌కు ఇక్క‌డే మ‌రో షాక్ త‌గిలింది.త‌మ పార్టీకే చెందిన రియా ట్వీట్ సంచ‌ల‌నం రేపుతోంది.ఆమె ట్వీట్ లో స్టాన్లీ త‌న‌ను కూడా 2019 స‌ద‌స్సులో ఇలాగే అసభ్యక‌రంగా తాకాడంటూ చెప్పింది.అయితే ఇలా క‌రోలిన్ నోక్స్ గొంతు విప్ప‌డం గొప్ప అంశ‌మంటూ ఆమె ట్వీట్ లో పేర్కొంది.

ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ప్ర‌ధాని తండ్రి గురించి ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌లం రేపుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube