ఆ రాష్ట్రంలో పిల్ల దొరుకుత‌లేద‌ట‌.. పెరిగిపోతున్న బ్యాచిల‌ర్స్‌

పెండ్లి అనేది మానవ జీవితంలో క‌చ్చితంగా ఉండాల్సిన భాగం.అది లేక‌పోతే జీవిత‌మే వ్య‌ర్థం అని ఇప్ప‌టికే ఎంతోమంది చెప్పేస్తున్నారు.

మ‌నిషి జీవితం సంపూర్ణం కావాలంటే క‌చ్చితంగా భార్యా, పిల్ల‌లు ఉండాల్సిందేనంట‌.అయితే మ‌న దేశంలో మాత్రం రోజురోజుకీ ఆడపిల్లల జ‌నాభా విప‌రీతంగా త‌గ్గుతోంది.

మామూలు గానే మ‌న దేశంలో ఆడ పిల్ల‌ల‌న వ‌ద్ద‌నుకుంటారు.ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే పురుషుల సంఖ్య పెరుగుతోంది.మ‌రి పెండ్లి చేసుకోవాలంటే పురుషుల‌కు త‌గ్గ‌ట్టు ఆడ‌పిల్ల‌లు కూడా ఉండాలి క‌దా.

Advertisement

కానీ ఇందుకు భిన్నంగా మ‌న దేశంలో పురుషులు పెరిగిపోయి చాలామందికి పెండ్లి చేసుకునేందుకు ఆడపిల్ల‌లు దొరుకుత లేరు.మ‌న దేశంలోని త‌మిళ‌నాడులో బ్రాహ్మణ యువకులకు అస‌లు ఆడ‌పిల్ల‌లు దొరుకుత‌లేరు.

దీంతో వారంతా కూడా 30-40 ఏళ్లు ఉన్న వారిలో 40 వేల మంది దాకా బ్యాచిల‌ర్స్ ఉన్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.అయితే ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన అబ్బాయిలు మొత్తం యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఉన్న త‌మ వ‌ర్గానికి చెందిన వారినే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారంట‌.

ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం ఈ బ్రాహ్మ‌ణ వ‌ర్గంలో 10 మంది యువ‌కుల‌కు కేవ‌లం ఆరుగురు అమ్మాయిలే ఉండ‌టంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.పైగా వీరంతా కూడా త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని మాత్ర‌మే పెండ్లి చేసుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర భార‌తంలోని రాష్ట్రాల వైపు చూస్తున్నారంట‌.ఉత్త‌రాది రాష్ట్రాల్లో తమిళ బ్రాహ్మణ సంఘం అమ్మాయిలు ఎక్క‌డ ఉంటే అక్క‌డ‌కు వెళ్లి మ‌రీ ఒప్పించి పెండ్లి చేసుకుంటున్నార‌ని స‌మాచారం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇక ఉత్త‌రాది వారి కోసం హిందీ కూడా నేర్చుకుంటున్నారంట‌.ఇన్ని చేస్తున్నా కూడా త‌మ‌కు వ‌ధువు దొర‌క‌ట్లేద‌ని వారంతా వాపోతున్నారు.

Advertisement

రాబోయే రోజుల్లో మ‌రింత మంది బ్యాచిల‌ర్స్ పెరిగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని నిఫుల‌ను హెచ్చ‌రిస్తున్నారు.

తాజా వార్తలు