బోయపాటి దర్శకుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు సూపర్ మాస్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.ఫైట్ సీన్స్ కానీ యాక్షన్స్ సన్నివేషాలు కానీ మాస్ ఎలివేషన్స్ కానీ తీయాలంటే అది బోయపాటి( Boyapati Srinu ) తర్వాతే ఎవరైనా.
అంతటి ప్రతిభాశాలి అయిన బోయపాటి భద్ర చిత్రం తో( Bhadra Movie ) టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి నుంచి మొదలు పెట్టిన బోయపాటి ప్రపంచం నిన్నటి స్కంద సినిమా వరకు కొనసాగింది.
బోయపాటి సినిమాల్లో సాధారణ ఫైట్స్ కన్నా కూడా భారీ ఫైట్స్ ఉంటాయి.
అలాగే తన హీరోలు ఎవరైనా షూటింగ్లో ప్రమాదానికి గురైతే తానే డూపుగా రంగంలోకి దిగుతాడు.
అయితే భద్ర సినిమా షూటింగ్ టైంలో బోయపాటి దర్శకుడు వంశీ పైడిపల్లి తో( Vamshi Paidipally ) గొడవకు దిగాడట.అందుకు కారణం ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భద్ర సినిమా బోయపాటికి మొదటిది కాగా ఈ సినిమాకి వంశీ పైడిపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట.వాస్తవానికి దిల్ రాజు దగ్గర వంశీ మొదట ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకునే పనిలో ఉండేవాడట.
భద్ర సినిమాకి కూడా బోయపాటి కావాల్సిన అన్ని రకాల ఫైనాన్స్( Finance ) వ్యవహారాలు వంశీ దగ్గర నుండి చూసుకున్నాడట.అయితే తాను కూడా ఒక సినిమాకి ఈ డైరెక్టు చేయాలని వంశీ అనుకున్నప్పుడు దిల్ రాజు( Dil Raju ) మొదట బోయపాటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ( Assistant Director ) పని చేయమని సూచించాడట దాంతో ప్రతిరోజు బోయపాటి ఎలా సినిమా తీస్తున్నాడు అనే విషయాన్ని దగ్గరుండి మరి వంశీ చూసి నేర్చుకున్నారట.
అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న టైం లో ఒక సీన్ బాగానే వచ్చింది అని కట్ చెప్పాడట బోయపాటి.కానీ వంశీ మాత్రం అస్సలు బాగాలేదని మరోసారి తీయాలని సూచించాడట.దాంతో బోయపాటికి కోపం వచ్చిందా ఈ డైరెక్టర్ నేనా నువ్వా అంటూ వంశీతో గొడవకు దిగాడట ఇదే విషయాన్ని ధనరాజ్ తో సహా చెప్పాడట.వంశీ దూకుడు తగ్గించుకుంటే మంచిదని లేదంటే సినిమా తీయడం కష్టమవుతుందని తను కాస్త పక్కకు ఉంటే తన సినిమా తాను పూర్తి చేసుకుంటారని దిల్ రాజుతో గొడవ పడ్డాడట.
ఆ తర్వాత దిల్ రాజు సైతం వంశీకి చెప్పడంతో ఆ తర్వాత బోయపాటి విషయంలో జోక్యం చేసుకోలేదట.ఇక భద్ర సినిమా కథ చాలా భిన్నంగా ఉండడంతో పాటు మేకింగ్ కూడా అద్భుతంగా రావడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.భద్ర సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ వేసి కూడా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.