ఫోటోగ్రఫీ అంటే ఇది... అనేలా చేసిన బుడ్డోడు..!

ఈ మధ్య కాలంలో సోషల్మీడియాలో రకరకాల వీడియోలు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి.ప్రపంచంలో ఎక్కడ ఏ వింత సంఘటన జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే అందరికి తెలిసిపోతుంది.

 Boy Funny Photography In Wedding Viral Video Details,  Photography, Viral Latest-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో ఫోటో షూట్ కి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి.ఫంక్షన్ ఏదైనా అవ్వనివ్వండి ముందు ఫంక్షన్ లో ఫోటోగ్రాఫర్ మాత్రం తప్పనిసరిగా ఉండాలిసిందే.

రకరకాల యాంగిల్స్ లో ఫోటో షూట్ చేయించుకోవడం ఈ మధ్య ట్రెండింగ్ గా మారిపోయింది.ఈ క్రమంలోనే కొందరు కెమెరాలలో కాకుండా తమ సెల్ ఫోన్ లలో కూడా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రతి ఫంక్షన్లో హడావుడి చేస్తుంటారు.

మరికొందరు అయితే రకరకాల ఫోజులలో ఫోటోలు వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఫోన్లో వీడియో తీసే అబ్బాయి చేసిన హడావుడికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో కనుక మీరు చూస్తే పడి పడి నవ్వడం ఖాయం.ఎందుకంటే ఈ వీడియోలో ఒక బుడ్డోడు అక్కడ జరిగే తాతంగాన్ని అంతా ఫోన్లో వీడియో తీయడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు.

కాసేవు నుంచుటాడు.మరికాసేపు కింద పనుకుంటాడు, మధ్య మధ్యలో వీడియో తీస్తూనే డాన్స్ కూడా చేస్తాడు.

ఇలా అన్ని రకాలుగా అతను వీడియో తీసే విధానం కాస్త వెరైటీగా ఉంది అనే చెప్పాలి.

వివరాల్లోకి వెళితే.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఫంక్షన్ లో అందరు కలిసి ఎంచక్కా డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఒక పిల్లడు మాత్రం డ్యాన్స్ చేస్తున్న వారిని మొబైల్ లో వీడియో తీయడం మొదలు పెట్టాడు.

సినిమాటిక్ స్టైల్ లో విజువల్స్ తీసే క్రమంలో ఆ పిల్లాడు చేసిన ప్రయత్నం అందరికి నవ్వు తెప్పించింది.కింద పడుకొని, అటు ఇటు దొర్లుకుంటూ ఏది మిస్ అవ్వకుండా వీడియో తీశాడు.

వీడియో తీస్తూనే మ్యూజిక్ కు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ అందరిని అలరించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.“ఫోటో గ్రాఫర్ ఆఫ్టర్ ఏ పెగ్ ఇన్ వెడ్డింగ్” అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది.ఈ వీడియో చూసిన వారు తమదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube