వైరల్ అవుతున్న సల్మాన్‌ ‘సారే జహాసే అచ్చా’ వీడియో...!

నేడు భారతదేశ 74 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అనేకమంది పలువురు రాజకీయ సినీ కళాకారులు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వారి స్టైల్ లో తెలుపుతున్నారు.ఈ సందర్భంగా నేడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన దేశభక్తిని ఓ పాట రూపంలో తానే స్వయంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను దేశ ప్రజలకు తెలియజేశారు.

 Bollywood Hero Salman Khan Sings Saare Jahan Se Acha Video, Bollywood Hero Salma-TeluguStop.com

ఈ వీడియోని బాలీవుడ్ నిర్మాత అఖిల్ అగ్నిహోత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేశారు.ప్రస్తుతం నేడు ఈ దేశ భక్తి పాట దేశం మొత్తంగా వైరల్ గా కొనసాగుతోంది.

ఇక ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సారే జహాసే అచ్చా అనే గీతాన్ని పాడారు.వీడియో చివరన సల్మాన్ ఖాన్ తన రెండు చేతులు జోడిస్తూ నమస్కారం తెలిపాడు.

ఇకపోతే సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి తన ఫామ్ హౌస్ నుండి బయటికి రాకుండా, అక్కడి నుంచే అన్ని పనులు చేస్తూ వచ్చారు.

ఇదివరకు లాక్ డౌన్ సమయంలో కొన్ని పాటలను విడుదల చేసి అభిమానులను అలరించాడు.అయితే ఇది వరకు కూడా సల్మాన్ ఖాన్ కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా పాడిన పాటలను విడుదల చేశారు.ఇక మీరు కూడా ఈ వీడియో ను చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube