ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ గూడ్స్ గ్రూప్ అయినటువంటి ‘యల్ వి యం హెచ్‘ మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 బిలియన్ డాలర్లను చేరుకొని, ప్రపంచంలోనే టాప్ 10 అతిపెద్ద కంపెనీల జాబితా లిస్టులో చేరిపోయిన సంగతి విదితమే.అయితే ఇది జరిగి కొన్ని రోజులు మాత్రమే అవుతుంది.
ఇంతలోనే ఈ కంపెనీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.విషయంలోకి వెళితే, ఈ నెలలో దాని షేర్లు దాదాపు 7 శాతం మేర లాభపడతంతో మార్కెట్ క్యాప్ పెరిగి తాజా రికార్డును నెలకొల్పింది.
మెుదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలతో రికార్డు సాధించిన యూరోపియన్ కంపెనీగా వెలుగొందింది.
ఈ క్రమంలోనే ఎలాన్ మాస్క్( Elon Mask ) కంపెనీ టెస్లా( Tesla ) విలువ 23 శాతం పడిపోవడం గమనార్హం.ఇక యల్ వి యం హెచ్ విలువ పెరుగుదలతో ‘బెర్నార్డ్ ఆర్నాల్ట్’ సంపద దాదాపు 212 బిలియన్ల డాలర్లకు చేరుకోవడం విశేషం.దీంతో ఎలాన్ మస్క్ మొదటి బిలియనీర్ స్థానాన్ని కోల్పోయారు.
దీనికి ముందు ఈ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ సంపద 165 బిలియన్ డాలర్లుగా ఉంది.కాగా తాజా మార్పులతో 73 ఏళ్ల వయస్సులో ఆర్నాల్ట్ ( Arnault )ఈ సరికొత్త రికార్డును సృష్టించారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం… లూయిస్ విట్టన్ ఛైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్డ్( Bernard Arnold ) తన తర్వాత పగ్గాలను వారసులకు అందించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ క్రమంలో ప్రధాన కార్యాలంయంలో ఓ ప్రైవేటు డైనింగ్ విందుకు తన 5 మంది పిల్లలను ఆహ్వానించారు.దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన భోజనం సమావేశంలో ఈ బిలియనీర్ పిల్లలను కంపెనీకి సంబంధించిన అనేక విషయాలపై ప్రశ్నించినట్టు భోగట్టా.అయితే దీనిలో మెరిట్ ఆధారంగా ఉత్తీర్ణత సాధించిన వారికి కంపెనీ పగ్గాలు అందే అవకాశం ఉందని తెలుస్తోంది.