బిగ్ బాస్ సీజన్ 6 ముగిసిన కొద్దిరోజుల నుంచే బిగ్ బాస్ సీజన్ 7 గురించి చర్చలు జరుగుతున్నాయి.బిగ్ బాస్ లో రేవంత్ టైటిల్ గెలిస్తే శ్రీహన్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు.
అయితే ఈ షో నిర్వహణ పై మొదటి నుంచే చాలా విమర్శలు వస్తున్నాయి సొసైల్ మీడియా లో అయితే విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.గేమ్ సరిగ్గా ఆడవాళ్ళని షో లో కంటిన్యూ చేయకుండా గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు.
షోలో జన్యున్ గా ఉంటూ బెస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నవాళ్ళు ఎలిమినేట్ అయితే ఆడియన్స్ మాత్రం నాగార్జున ని ట్రోల్స్ చేస్తున్నారు.
నిజానికి కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనేది నాగార్జున చేతిలో ఏం ఉండదు.బిగ్ బాస్ యాజమాన్యమే అదంతా చూసుకుంటారు కానీ ఎలిమినేషన్ ప్రక్రియలో నాగార్జున జనాల దృష్టిలో బాడ్ అవుతున్నాడు అనే ఉద్దేశ్యంతో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 చేసే ఆలోచనలో లేడనే వార్తలు వస్తున్నాయి.అలాగే చాలా మంది ఈ షో దేనికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు ఇంకా కొందరు అయితే ఈ షో ద్వారా యాజమాన్యం సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు, ఆడ, మగ ఇద్దరినీ తీసుకువచ్చి 100 రోజులు ఒక 20 మంది ని ఒకే ఇంట్లో వేసి ఉండమనడం ఇదేం సంస్కృతి అని అంటున్నారు…
సీజన్ 3 నుండి మొదలుకుని సీజన్ 6 వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.మధ్య లో ఒక ఓటీటీ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మొత్తంగా అయిదు సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
నాగార్జున( Nagarjuna ) చేసిన సీజన్స్ అన్ని సక్సెస్ అయ్యాయి కానీ సీజన్ 6 మాత్రం అంత గా సక్సెస్ కాలేదనే చెప్పాలి.దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్ యాజమాన్యమే అనేది తెలుస్తుంది.
అందుకే నాగార్జున నెక్స్ట్ సీజన్ పైన పెద్దగా ఆసక్తి చూపించడం లేదని కూడా తెలుస్తుంది.
స్టార్ మా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ షో కొత్త సీజన్ కి ఇద్దరు హీరోలు హోస్టులు గా వ్యవహరించనున్నారు అని తెలుస్తుంది.ఒకరు సీనియర్ హీరో కాగా మరొకరు యంగ్ హీరో అని తెలుస్తుంది.ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అందులో బాలయ్య ఒకరైతే,ఇంకొకరు యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishawak sen ) అని తెలుస్తుంది…ఇక ఇప్పటికే ఆహా లో అన్ స్టాపబుల్ ( Aha )తో రచ్చ చేసిన బాలయ్య తో పాటు అదే స్టేజ్ మీద విశ్వక్ సేన్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది…
.