'భగవంత్ కేసరి' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..టాక్ ఎలా ఉందంటే!

‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో కెరీర్ లో మంచి ఊపు మీదున్న బాలయ్య( Balayya ), ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘భగవంత్ కేసరి’( Bhagwant Kesari ) చిత్రం ద్వారా ఈ నెల 20 వ తారీఖున దసరా కానుకగా మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ , ట్రైలర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 'bhagwant Kesari' Censor Programs Are Complete How Is The Talk , Bhagwant Kesari-TeluguStop.com

ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఈ చిత్రం లో బాలయ్య మార్క్ హీరోయిజం అలాగే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) మార్క్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్నట్టుగా అనిపించింది.ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి ఆరు లక్షల డాలర్లు వచ్చేలా అనిపిస్తుంది.

ఇకపోతే ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి.సెన్సార్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

Telugu Anil Ravipudi, Balayya, Bhagwant Kesari, Kajal Aggarwal, Sreeleela, Tolly

సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి UA సర్టిఫికేట్( UA Certificate ) ని జారీ చేసారు.సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూడగానే పైకి లేచి చప్పట్లు కొట్టారట.బాలయ్య నుండి ఇలా మాస్ , ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది అని, ఇందులో ఆయన ఎంతో ఎమోషనల్ గా నటిస్తూనే, పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టాడని.ముఖ్యంగా ఇంట్రడక్షన్ సన్నివేశం,ఇంటర్వెల్ సన్నివేశం మరియు ప్రీ క్లైమాక్స్ సన్నివేశం ఈ చిత్రం ని మరో లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు.

స్టోరీ లైన్ రొటీన్, కాస్త రవితేజ రాజా ది గ్రేట్ స్టోరీ లైన్ తో పోలి ఉంటుంది.కానీ టేకింగ్ మాత్రం ఆడియన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో మరో వారం రోజుల్లో తెలియనుంది.

Telugu Anil Ravipudi, Balayya, Bhagwant Kesari, Kajal Aggarwal, Sreeleela, Tolly

ఇక ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.ఈమధ్యనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు కాబట్టి, అదే ఈ సినిమాకి సంబంధించిన పెద్ద లాంచ్ ఈవెంట్ అని కొంతమంది అంటున్నారు.

ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే బుధవారం రోజు ఉండే అవకాశం ఉందట.ఈ చిత్రం లో బాలయ్య బాబు కి జోడిగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటించగా, శ్రీలీల( Sreeleela ) బాలయ్య కూతురి పాత్రలో నటించింది.

అలాగే ప్రముఖ బాలీవడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రం లో విలన్ గా నటించాడు.ఈ సినిమాకి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంటుందట.

బాలయ్య గత రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడం లో థమన్ పాత్ర ఎక్కువ ఉంది, ఈ చిత్రం లో కూడా అలాగే ఉంటుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube