సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు వేధింపులు అన్నవి కామన్.ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో హీరోయిన్లకు వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి.
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న ప్రతి ఒక్క హీరోయిన్ ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) అనుభవాలను వేధింపులను ఎదుర్కొన్న వారే.అయితే కొందరు అలాంటి అనుభవాలు ఎదురైనా కూడా వాటిని బయటకు చెప్పకుండా వారిలోనే దాచుకుంటూ ఉంటారు.
ఇంకొందరు ఎటువంటి భయం లేకుండా పేర్లతో సహా బయట పెట్టేస్తూ ఉంటారు.అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది వారి ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఒక నటికి కూడా షూటింగ్లో అలాంటి అనుభవం ఎదురైంది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.సినిమా సెట్స్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేయడంతో వెంటనే తాను షూటింగ్ నుంచి బయటికి వచ్చేసినట్లు తెలిపింది.కోల్‌కతాకు చెంది బెంగాలీ నటి, రాజకీయవేత్త అయిన సయంతిక బెనర్జీ( Sayantika Banerjee ) ఇటీవలే బంగ్లాదేశ్‌లో ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.
అయితే సినిమా సెట్స్‌లో తనపట్ల కొరియోగ్రాఫర్ మైఖేల్( Choreographer Michael ) అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది.షూటింగ్ సమయంలో ఆమె అనుమతి లేకుండానే ఆమె చేతులు పట్టుకున్నట్లు తెలిపింది.

అయితే ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పినా పట్టించుకోలేదని, ఇక నిర్మాతల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో షూట్ మధ్యలోనే ఆపేసి ఇండియాకు తిరిగొచ్చినట్లు ఆమె వెల్లడించింది.అయితే ఈ ఘటనపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు.బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన సయంతిక తన రాబోయే చిత్రం చాయాబాజ్( Chayabaz ) షూటింగ్‌లో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె షూటింగ్‌లో జరిగిన సంఘటనను వివరించింది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.