రెండో రోజుకే అలిసిపోయిన రూలర్.. కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమాకు రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్‌‌ను మూటగట్టుకుంది.

 Balakrishna Ruler Movie 2 Days Collections-TeluguStop.com

రొటీన్ కథతో బాలయ్య మరోసారి ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిచాడంటూ రివ్యూలు తమ ఆగ్రహాన్ని వెల్లడించాయి.

రూలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.తొలిరోజు రెండు రాష్ట్రాల్లో కలిసి రూ.4 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రూలర్ చిత్రం, రెండో రోజు తేలిపోయింది.కలెక్షన్ల పరంగా రెండో రోజు రూలర్ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి.దీంతో కేవలం రూ.1 కోటి మాత్రమే వసూళ్లు సాధించింది ఈ చిత్రం.వీకెండ్ అయినప్పటికీ రూలర్ సినిమా చూసేందుకు జనం ఆసక్తి చూపించలేదు.

దీంతో ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా మిగలనుంది.

ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 0.97 కోట్లు

సీడెడ్ – 1.32 కోట్లు

నెల్లూరు – 0.25 కోట్లు

కృష్ణా – 0.24 కోట్లు

గుంటూరు – 1.28 కోట్లు

వైజాగ్ – 0.39 కోట్లు

ఈస్ట్ – 0.32 కోట్లు

వెస్ట్ – 0.26 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 5.03 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube