టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ కారు డ్రైవర్ నాగరాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.కుప్పంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బైకుపై వెళ్తుండగా స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ దగ్గర దాడికి దిగారు.దీంతో గాయపడిన బాధితుడు నాగరాజును స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.