నగరంలో కూకట్ పల్లి నిజాంపేట్ లో ఈ నెల 27వ తేదీన రోడ్డు ప్రమాదంలో ఓ ఏఎస్సైకి తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే.ఫుల్గా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ వచ్చిన మందు బాబులు చేసిన ఈ ఘనకార్యం వల్ల గాయపడిన ఏఎస్సై మైపాల్ రెడ్డి నిన్న అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు సమాచారం.
నిజాంపేట్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై ని, కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారట.కాగా ఈ ప్రమాదంలో మైపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్దితి విషమించి మరణించారని వైద్యులు వెల్లడించారట.
చూశారా ఎవరో చేసిన తప్పుకు విధినిర్వహణలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.కాగా మందుబాబులపై ఎన్ని చర్యలు తీసుకుంటున్న వారి ఆగడాలు ఆగడం లేదు.
విచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వమే ఇలాంటి ప్రమాదాలకు బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నిస్తున్నారట కొందరు.