అభిమాని గుండెల్లో అషు రెడ్డి.. చచ్చేంత వరకు నీ అభిమానినేనంటూ?

బుల్లితెర ఆర్టిస్ట్, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి మొత్తానికి తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.తన అందంతో మాత్రం కుర్రాళ్ళ మదిలో గుడి కట్టేసుకుంది.

 Ashu Reddy Die Hard Fan With Ashu Reddy Photo On His Heart Details, Ashu Reddy,-TeluguStop.com

ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.ప్రస్తుతం బుల్లితెర పై ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.

పైగా వెండితెరపై కూడా బాగా బిజీ గా మారింది.

కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టి లో పడిన ఈ ముద్దుగుమ్మ అచ్చం సమంత లాగా కనిపించడంతో జూనియర్ సమంత గా పేరు సంపాదించుకుంది.

దాంతో వెండితెరపై నితిన్ నటించిన సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా అవకాశం అందుకుంది.ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని తన పరిచయాన్ని పెంచుకుంది.

అందులో తను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షో తర్వాత టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో బాగా ఎంజాయ్ చేసింది.

అతడితో కలిసి పార్టీలు, పబ్ లు తిరుగుతూ అతడితో డేటింగ్ చేస్తున్నట్లు అందరి దృష్టిలో పడిపోయింది.కానీ ఆ తర్వాత ఆ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చాలాసార్లు చెప్పుకున్నారు.

Telugu Ashu Reddy, Ashureddy, Biggboss, Stars Show, Express Hari, Pawan Kalyan,

ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన కామెడీ స్టార్స్ అనే కామెడీ షో లో లేడీ కమెడియన్ గా చేసింది.అందులో మరో ఆర్టిస్ట్ హరి తో కలిసి బాగా రచ్చ చేసింది.ఏకంగా అతడికి ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.దీంతో హరి తో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కానీ అదంతా పుకారే అని కేవలం షో కోసం అలా చేశామని గతంలో చెప్పుకున్నారు.

Telugu Ashu Reddy, Ashureddy, Biggboss, Stars Show, Express Hari, Pawan Kalyan,

ఇక ఈమె కు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం గురించి మాటల్లో చెప్పలేము.ఏకంగా ఆయన పేరును టాటూ వేయించుకుని మరీ తన అభిమానమేంటో నిరూపించింది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు బాగా షేర్ చేసుకుంటుంది.

అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు కూడా పంచుకుంటుంది.

Telugu Ashu Reddy, Ashureddy, Biggboss, Stars Show, Express Hari, Pawan Kalyan,

యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక యాంకర్ రవి తో కూడా ఫన్నీ వీడియోలు చేస్తూ బాగా షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.

ఇదిలా ఉంటే అషు కు తాజాగా తన అభిమాని షాక్ ఇచ్చాడు.

తన అభిమాని తన ఫోటో షేర్ చేసుకుంటూ అందులో తన గుండెల పై అషు రెడ్డి ఫోటో ని ఎడిట్ చేసి.

చచ్చేంత వరకు నీ అభిమానినే అనటంతో వెంటనే అషు ఆ ఫోటోని షేర్ చేసుకుంటూ ఓ మై గాడ్ ఏంటిది.అంటూ అతడికి థాంక్యూ చెప్పుకుంది.

ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక అషు ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube