రజనీ సినిమా పాటకు డాన్స్ వేసిన అషు రెడ్డి... లేపుకెళ్లి పోవాలని ఉందన్న నెటిజన్?

సోషల్ మీడియా( Social media ) ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకోని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో అషు రెడ్డి (Ashu Reddy) ఒకరు.టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె కాస్త సమంత పోలికలతో ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమె వీడియోలు చూసి జూనియర్ సమంత అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

 Ashu Reddy Danced To Rajinis Movie Song , Ashu Reddy Danced To Rajini's Movie So-TeluguStop.com

ఇలా జూనియర్ సమంత అనే టాగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అషు రెడ్డి పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు.అలాగే బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా రెండుసార్లు పాల్గొనే అవకాశం అందుకున్నారు.

ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ఎన్నో వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో చాలా నాజుగ్గా తయారైనటువంటి ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

ఇకపోతే తాజాగా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ (Jailer ) సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే సాంగ్ ఎలా ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేశారు.అయితే ఈమె మాత్రం కాస్త లేటుగా ఈ ట్రెండ్ ఫాలో అయ్యారని చెప్పాలి.ఇక తాజాగా ఈమె ఈ పాటకు డాన్స్ చేస్తున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అద్భుతమైన స్టెప్స్ వేస్తూ ఉన్నటువంటి ఈ వీడియోని అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో పైనెటిజన్స్ ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు.ఈ వీడియోలో డాన్స్ చేస్తున్న సమయంలో ఆమె కాలికి దెబ్బ తగలడంతో కాస్త చూసుకొని చేయాలి కదా డాన్స్ అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం చాలా లేటుగా ఈ రీల్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.

ఇక మరొక నేటిజన్ అయితే ఏకంగా తనని లేపుకొని వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ కామెంట్ చేయడం గమనార్హం.జూనియర్ సమంత ( Samantha) అని టాగ్ వేయించుకున్నటువంటి ఈమె ఈ వీడియో పై సదరు నెటిజన్స్ స్పందిస్తూ ఎందుకు నువ్వు ఇలా సమంత పోలికలతో కనబడుతున్నావు నాకు ఇలా అయితే లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటాను అంటూ కామెంట్ చేయడం విశేషం.ఇలా అషు రెడ్డి వీడియో పై సదరు నెటిజన్ కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube