'నీచమైన పుకార్లకు స్థానం లేదు'.. బ్రేకప్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అర్జున్ కపూర్!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే సమంత – నాగ చైతన్య, అమీర్ ఖాన్ – కిరణ్ రావు ల విడాకుల విషయం అందరికి పెద్ద షాక్ ఇచ్చింది.ఇంకా చై-సామ్ ల గురించి అయితే చెప్పనవసరం లేదు.

 Arjun Kapoor Shuts Down Breakup Rumours With Malaika Arora In Style Details,arju-TeluguStop.com

ఇన్ని రోజులు అవుతున్న ఇంకా సమంత నాగ చైతన్య విడిపోయారంటే మాత్రం నమ్మలేక పోతున్నారు.ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరొక స్టార్ కపుల్ మధ్య బ్రేకప్ అయ్యిందంటూ గత రెండు రోజులుగా పుకార్లు వస్తున్నాయి.

బాలీవుడ్ ప్రేమ పక్షులు అయిన అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని నిన్న ఉదయం నుండి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.వీరిద్దరూ నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.

అయితే వీరు విడిపోయారని ప్రచారం జరుగుతుంది.గత కొన్ని రోజులుగా మలైకా తన ఇంటి నుండి బయటకు రాలేదని.

అర్జున్ కపూర్, రియా కపూర్ తో కలిసి డిన్నర్ పార్టీలో కూడా చేరలేదని అందుకే వీరు విడిపోయారని ఈ వార్తల సారాంశం.

అయితే తాజాగా వీరి బ్రేకప్ పై వస్తున్న వార్తలపై అర్జున్ కపూర్ స్పందించారు.

ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అర్జున్ కపూర్ మలైకా అరోరా తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు.”నీచమైన పుకార్లకు స్థానం లేదు.ప్రజలకు శుభాకాంక్షలు.

అందరిని పేమిస్తున్నాను.సురక్షితంగా ఉండండి” అంటూ వారిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు.

దీంతో నిన్నటి నుండి వస్తున్న వార్తలలో నిజం లేదని తేలి పోయింది.పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా మలైకా అరోరా విహార యాత్రలను పరిమితం చేసిందని.అర్జున్ కపూర్, అతని సోదరి అన్షుల కపూర్, రియా కపూర్, ఆమె భర్త కరణ్ లకు కొన్ని వారాల క్రితం పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉండడం వల్ల వీరిద్దరూ కలుసుకోవడం లేదని తెలుస్తుంది.ఇక అర్జున్ కపూర్ తన కంటే 12 ఏళ్ళు పెద్దదైన మలైకా అరోరా తో డేటింగ్ చేస్తున్నాడు.

ఏజ్ తో సంబంధం లేదంటూ వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube