Apple uses :ఆపిల్ యూజర్లు మరేమీ భయపడొద్దు... ఆ బగ్‌ ను కంపెనీ ఫిక్స్ చేసేసింది!

ఈ ప్రపంచంలో లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లలో ఆపిల్ ఫోన్ లు చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి.వీటినుండి ఏవైనా కొత్త సిరీస్ ఫోన్లు ఎప్పుడెప్పుడొస్తాయా అని యువత వేయి కళ్ళతో ఎదురు చూస్తూ వుంటారు.

 Apple Users Do Not Fear Anything Else. The Company Has Fixed That Bug! Apple,-TeluguStop.com

యూజర్ల సౌకర్యార్ధం ఆపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది.అందుకే వీటిని బ్రాండ్ కా బాప్ అని అంటూ వుంటారు.

అయితే ఇలాంటి ఫోన్స్ కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది.తాజాగా సఫారీ బ్రౌజర్ యూజర్లకు ఓ సమస్య ఏర్పడింది.

సఫారీ బ్రౌజర్ పదేపదే క్రాష్ అవుతున్నట్టు కంపెనీకి ఫోన్ కాల్స్ వెళ్లడంతో ఈ సమస్యపై దృష్టి సారించారు.

Apple రిపోర్టు ప్రకారం.

iPhoneలు iPadలలో Safari పదేపదే క్రాష్ అవుతోంది.అయితే తాజాగా ఈ బగ్‌ను ఆపిల్ సర్వర్ అప్‌‌డేట్ ద్వారా ఫిక్స్ చేసింది.కాబట్టి యూజర్లు ఈ విషయాన్ని గమనించగలరు. 9to5Mac తాజా నివేదిక ప్రకారం.ఐఫోన్ యూజర్లు సఫారిలోని అడ్రస్ బార్‌లో కొన్ని పదాలను టైప్ చేయడం ద్వారా బ్రౌజర్ యాప్ వెంటనే షట్ డౌన్ అయిపోతోంది.ఈ బగ్ నిర్దిష్ట వెబ్‌సైట్‌ల URLను టైప్ చేయకుండా అడ్డుకుంటుంది.

iPad, iPhone యూజర్లను బ్రౌజర్ ఓపెన్ చేయకుండానే క్లోజ్ అవుతుంది.

Telugu Apple, Fixed, Latest, Ups-Latest News - Telugu

అంతేకాకుండా ఈ బగ్ కారణంగా iOS 16 వెర్షన్‌లోని బ్రౌజర్ పనితీరు కూడా సరిగ్గా లేదు.ఇకపోతే ఆపిల్ ఐఫోన్‌లను కంపెనీ బీటా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లకు భారత మార్కెట్లో 5G కనెక్టివిటీకి సపోర్టు ఇచ్చే అప్‌డేట్ లాంచ్ చేయడం జరిగింది.గత నెలలో Apple ప్రకటన ప్రకారం.

కంపెనీ ఈ ఏడాదిలో డిసెంబర్ నుంచి iPhoneలలో 5G కనెక్టివిటీ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని భావిస్తున్నారు.ఐఫోన్‌లలో 5G కనెక్టివిటీ iPhone 14 సిరీస్, iPhone 13, iPhone 12, iPhone SE (3rd Gen)లలో పని చేస్తుంది.

డివైజ్‌లు Airtel, Reliance Jio రెండింటి నుంచి 5G కనెక్టివిటీకి సపోర్టు అందిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube