వానాకాలంలో ఈ టీ తాగడం వలన రోగాలన్నిటికీ చెక్..!

ఈమధ్య కాలంలో చాలామంది వయసు తేడా లేకుండా టీ తాగడానికి ఇష్టపడతారు.టీ తాగాలని ప్రతి ఒక్కరు కూడా తహతహలాడుతూ ఉంటారు.

 Drinking This Tea In Rainy Season Will Check All Diseases..! , Rainy Season , C-TeluguStop.com

ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు కూడా ముందుగా టీ తాగడానికి ఇష్టపడతారు.అంతేకాకుండా సాయంత్రం పూట కూడా కచ్చితంగా టీ తాగుతూ ఉంటారు.

మరి ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఉదయాన్నే చాయ్ తాగకపోతే ఆ రోజే గడవదు అని చెప్పవచ్చు.వర్షాకాలంలోని చల్లటి వాతావరణం లో వేడి వేడి టీ తాగుతూ ఉంటే ఆ మజానే వేరు.

అయితే వర్షాకాలం వచ్చిందంటేనే చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడతారు.కాబట్టి వైద్యులు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.

Telugu Cardamom Tea, Tips, Immunity, Rainy Season-Telugu Health

అయితే వర్షాకాలంలో యాలకుల టీ ( Cardamom Tea )తాగడం వలన చాలా లాభాలు ఉన్నాయి.ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతిరోజూ ఉదయాన్నే మామూలు టీకు బదులుగా యాలకుల టీ తాగడం వలన ఎన్నో రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.అంతేకాకుండా యాలకుల టీ తాగడం వలన ముఖ్యంగా జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించి మంచి మేలు జరుగుతుంది.

ఈ టీ తాగడం వలన జీర్ణక్రియ( Digestion ) ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.ఇక వర్షాకాలంలో ప్రతిరోజు యాలకుల టీ తాగడం వలన శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి( Immunity ) కూడా బాగా పెరుగుతుంది.

అంతేకాకుండా ఈ టీ ని తాగడం వలన ఒత్తిడి నుంచి బయట పడవచ్చు.

Telugu Cardamom Tea, Tips, Immunity, Rainy Season-Telugu Health

ఎందుకంటే ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) అధిక పరిమాణంలో ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.అయితే యాలకుల టీలో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి.కాబట్టి వర్షాకాలంలో వచ్చే ఎలాంటి వ్యాధులకు అయినా దూరం చేసే శక్తి యాలకుల టీ లో ఉంది.

అంతేకాకుండా తలనొప్పి, అలసట నుండి కూడా ఈ టీ తాగడం వలన ఉపశమనం కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube