అదేంటో కానీ ఇంట్లో వారి పెళ్లి కంటే సెలబ్రెటీల పెళ్లిళ్లపై బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు జనాలు.నిజానికి ఇతరుల వ్యక్తిగత విషయాలపైనే ఎప్పుడు ధ్యాస పెడుతూ ఉంటారు.
అయితే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్( Varun ) – లావణ్యల ( Lavanya )పెళ్లి ఎప్పుడు అంటూ తెగ ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్.గత ఐదు సంవత్సరాల నుండి ఈ జంట సీక్రెట్ ప్రేమాయణం నడిపి కేవలం తమ కుటుంబ సమక్షంలోనే ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఇక వీరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి నిత్యం వారికి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.ముఖ్యంగా ఎంగేజ్మెంట్ కు ముందు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయటంతో బాగా వైరల్ అయ్యాయి.
నిజానికి వీరిద్దరి ప్రేమలో ఉన్నంతకాలం ఎవరికీ అనుమానం రాకుండా సైలెంట్ గా నడిపించారు.మధ్య మధ్యలో కొన్ని అనుమానాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అక్కడికే పుల్ స్టాప్ పెట్టేలా చేశారు.

ఐదేళ్ల కిందట వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించగా ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టింది.అప్పటినుండి వీరిద్దరు ఎటువంటి గాసిపులకు లొంగకుండా జాగ్రత్త పడుతూ రీసెంట్గా ఎంగేజ్మెంట్ తో అందరికి షాక్ ఇచ్చారు.ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా ఎవరికీ లీక్ చేయకుండా కేవలం తమ కుటుంబ సమక్షంలోనే జరుపుకున్నారు.ఎంగేజ్మెంట్ తర్వాత వారి ఫోటోలు లీక్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక మొత్తానికి ఈ జంట తమ ప్రేమను గెలిపించుకోవడానికి ముందు అడుగు వేశారు.ఇక త్వరలో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు మెగా ఫ్యామిలీ ( Mega Family )అటు లావణ్య ఫ్యామిలీ.
అయితే ఆగస్టు 24వ తేదీ ఇటలీలో వీళ్ళ పెళ్ళి గ్రాండ్ గా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే రీసెంట్ గా వరుణ్ ఇటలీ( Italy )కి వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడ తన కాబోయే భార్య లావణ్యతో దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

అయితే వరుణ్ ఇటలీకి వెళ్లడానికి కారణం ఏదో కాదు.త్వరలో పెళ్లి ముహూర్తం దగ్గరికి వస్తున్న సందర్భంగా పెళ్లి పనులు చూసుకోవటానికి నేరుగా లావణ్య ఇంటికి ఇటలీకి వెళ్లి తమ పెళ్ళికి కావాల్సిన అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నట్లు తెలిసింది.త్వరలో వీరి పెళ్లి గురించి ప్రకటన కూడా చేయనున్నారట మెగా ఫ్యామిలీ.
ఇక ఈ పెళ్లికి కేవలం అల్లు, మెగా ఫ్యామిలీ మాత్రమే అటెండ్ అవ్వనున్నట్లు తెలిసింది.

వీరి పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు రావట్లేదని తెలుస్తుంది.అదేంటంటే పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని.అక్కడికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు కూడా అటెండ్ అవ్వనున్నారని తెలిసింది.
ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవ్వడంతో జనాలు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక మరి కొంతమంది పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలని కోరుతున్నారు.