సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న అమరావతి అసైన్డ్ భూముల అక్రమాల కేసును రీఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.కాగా అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలోనే కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కేసులపై విచారణ రీఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.