ఏపీ కరోనా అప్‌డేట్స్.. గడచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే.. ? 

దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కోవిడ్ 19 వ్యాక్సిన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతున్న వేళ కేసులు ఇలా వ్యాపించడంతో అధికారుల్లో కొంత ఆందోళన మొదలవుతుందట.

 Ap Corona Updates How Many Cases In The Last 24 Hours, Ap, Corona Updates, New C-TeluguStop.com

ఇకపోతే ఏపీలో గడచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు చేపట్టగా, 106 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందట.కాగా చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 33 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇకపోతే తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 10 కేసులు నమోదవగా, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు ఏవీ నమోదు కాలేదట.

ఇక రాష్ట్రంలో 57 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇకపోతే ఏపీలో ఇప్పటి వరకు 8,90,080 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,137 మంది కరోనా నుంచి బయటపడగా, ఇంకా 774 మంది చికిత్స తీసుకుంటున్నారట.ఇప్పటి వరకు ఈ వైరస్ వల్ల 7,169 మంది మరణించారని అధికారులు వెల్లడించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube