వైఎస్ జగన్ అభ్యర్ధనని ప్రధాని వినే పరిస్థితి ఉందా! అదే జరిగితే జగన వ్యూహం ఏంటి

లోక్ సభలో భారీ విజయాన్ని సొంతం చేసుకొని మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడంతో మోడీ ప్రధానిగా రెండో సారి బాద్యతలు తీసుకున్నారు.ఇక ప్రధానిగా బాద్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ మోడీ తిరుపతికి వచ్చారు.

 Ap Cm Jagan Feature Plan On Ap Special Status-TeluguStop.com

ఇక తిరుపతి పర్యటనలో ఏపీ సిఏం జగన్ మోడీని కలుసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి స్వాగతం పలికారు.ఇక ఈ ఇద్దరి పలకరింపులు, బంధం చూస్తూ ఉంటే బీజేపీకి ఇప్పుడు వైసీపీ మిత్రపక్షంగా మారిపోయింది అనే టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం మోడీతో జరిగే సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తామని, మోడీతో చర్చించి వారి నిర్ణయం ఎలా ఉందో తెలుసుకుంటా అని జగన్ చెప్పకనే చెప్పారు.

దీనిని బట్టి మోడీ నిర్ణయం కోసం జగన్ వేచి చూస్తున్నాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే అధికారంలో పదేళ్ళు పోరాటం చేసిన జగన్ ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఎంత వరకు పోరాటం చేస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిన నేపధ్యంలో ఇప్పుడు మళ్ళీ జగన్ అడిగితే ఇస్తారా అనేది ప్రశ్నగా మారింది.ఒక వేళ ప్రత్యేక హోదాపై మాట్లాడే అవకాశం లేదని తేల్చేస్తే అప్పుడు జగన్ ఎ స్టాండ్ తీసుకుంటాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube