భారతీయుడు 2 మరో ఇద్దరు హీరోయిన్స్  

Another Two Heroines In Barathiyudu 2-

దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ కమల్ హసన్ తో తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 ఎట్టకేలకు మళ్ళీ మొదలైంది.మొదటి షెడ్యూల్ అనంతరం ఊహించని విధంగా అడ్డంకులు ఎదుర్కొన్న డైరెక్టర్ మొత్తానికి నిర్మాతలతో చర్చలు జరిపి సెకండ్ షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నాడు.

Another Two Heroines In Barathiyudu 2- Telugu Tollywood Movie Cinema Film Latest News Another Two Heroines In Barathiyudu 2--Another Two Heroines In Barathiyudu 2-

Another Two Heroines In Barathiyudu 2- Telugu Tollywood Movie Cinema Film Latest News Another Two Heroines In Barathiyudu 2--Another Two Heroines In Barathiyudu 2-

మరికొన్ని రోజుల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.ఇప్పటికే నటీనటుల డేట్లు క్యాన్సిల్ కావడంతో చిత్ర యూనిట్ మళ్ళీ రీ షెడ్యూల్ చేసింది.

ఇక షూటింగ్ ని మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.అయితే రీసెంట్ గా దర్శకుడు శంకర్ మరో ఇద్దరి హీరోయిన్లను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళ్ బ్యూటీస్ ఐశ్వర్య రాజేష్ – ప్రియా భవాని సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.అయితే వారు ఎలాంటి పాత్రల్లో కనిపించనున్నారు అనే విషయాన్ని బయటకు రానివ్వడం లేదు.

అలాగే విద్యుత్ జమ్మవాల్ విలన్ పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు.త్వరలోనే ఈ స్టార్ యాక్టర్ చిత్ర యూనిట్ తో కలవనున్నాడు.లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.