మీకు ఇంగ్లీషు నేర్పే యాప్ ఇది

అంగ్లం అందరికి అవసరం.మన భాష కాదు, మన సంస్కృతి కాదు, ఒప్పుకోవాల్సిందే కాని హిందీతో పాటు ఇంగ్లీషుకి కూడా ఆఫిషియల్ లాంగ్వేజ్ అనే దర్జానిచ్చారు కదా మనవాళ్ళు.

 An App To Learn English Efficiently – Hello English-TeluguStop.com

అందుకే గవర్నమెంటు ప్రకటనలు ఇంగ్లీషులో వస్తాయి, చట్టసభల్లో మంత్రులు ఇంగ్లీషులో మాట్లాడతారు, తరగతుల్లో ఇంగ్లీషు పాఠాలు చెబుతారు, ఉద్యోగం ఇవ్వాలంటే ఇంటర్వ్యూలు ఇంగ్లీషులో చేస్తారు.ఈ అవసరాలన్ని పక్కనపెడితే, మన చుట్టాల్లోనే చూడండి .ఎవరైనా అమ్మాయో, అబ్బాయో గబగబా ఇంగ్లీషులో మాట్లాడితే వారిని ఎంత పెద్దవైన కళ్ళతో చూస్తారో.సింపుల్ గా చెప్పాలంటే, ఇంగ్లీషు వచ్చినవారి లెవెల్ వేరే .మనకి ఇంగ్లీషు బాగా నేర్పించడానికి ఒక యాప్ ఉందండోయ్.

పూర్తిగా రాని వారికి, ఇంగ్లీషు మామూలుగా వచ్చి బాగా నేర్చుకోవాలి అనుకునేవారికి .ఇద్దరికి ఈ యాప్ పనికివస్తుంది.దీని పేరు Hello English : Learn English.రకరకాల భాషల్లో దొరుకుతుంది.మీకు ఎలాగో తెలుగు – ఇంగ్లీష్ కావాలి కదా.ఆ అప్షన్ సెలెక్టు చేసుకున్నాక మీకు మొత్తానికే రాదా లేక కొంచెం అవగాహన ఉందా అని అడుగుతుంది.అవగాహన ఉంది అంటే ఓ పరీక్ష పెట్టి కొన్ని ప్రశ్నలు వేస్తుంది.

ఆ పరీక్ష ఫలితాన్ని బట్టి మీరు యాప్ లో ఎలాంటి పద్ధతుల ద్వారా పాఠాల్ని మొదలుపెట్టాలో సూచిస్తుంది.పూర్తిగా రానివారి పాఠాలు వేరుగా ఉంటాయి.

ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి వాక్యాలు ఉపయోగించి మాట్లాడాలో ఇందులో లెసన్స్ ఉంటాయి.ఇందులో డిక్షనరీ కూడా ఉంటుంది.

మీకు కావాల్సిన ఇంగ్లీషు పదం యొక్క అర్థాన్ని అక్కడే తెలుగులో తెలుసుకోవచ్చు.పాఠాలు నేర్చుకున్న కొద్ది ప్రాక్టీసు చేసుకోవడానికి అక్కడే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని అంగ్లం బాగా నేర్చుకోవడం మొదలుపెట్టండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube