అమ్మ బాబోయ్ : పంది అంటూ అషు రెడ్డి పై వీడియో చేసిన రవి.. దాంతో...

తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయిన “బిగ్ బాస్” మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులని బాగానే అలరించిన “అషూ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకి కొత్త గా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత అషు రెడ్డికి సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోయింగ్ బాగానే పెరిగింది.

 Anchor Ravi Sharing Funny Video On Ashu Reddy, Telugu Anchor, Ravi, Ashu Reddy,-TeluguStop.com

దీంతో అషూ రెడ్డి కూడా అప్పుడప్పుడు పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ అలాగే పలు రకాల షోలు, ఈవెంట్లలలో పాల్గొంటూ బాగానే సంపాదిస్తుంది.

అయితే తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్ రవి అషూ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోలో అషూ రెడ్డిని చూపిస్తూ యాంకర్ రవి ఏకంగా హైదరాబాదులోని వనస్థలిపురం లో ఓ అడవి పంది కలకలం రేపిందంటూ బ్యా గ్రౌండ్ వాయిస్ తో వీడియో చేశాడు.అంతేగాక “ఐ యాం సారీ అషూ … ఇది నీకు బాగా సూటవుతుందని అందువల్లనే ఈ వీడియోని షేర్ చేయకుండా ఉండలేక పోయానని అలాగే ఈ వీడియోని చూస్తున్నంతసేపు నాకు చాలా నవ్వు వచ్చిందని” క్యాప్షన్ కూడా పెట్టాడు.

దీంతో అషూ రెడ్డి యాంకర్ రవి షేర్ చేసిన ఈ వీడియో పై స్పందిస్తూ “ఓ మై గాడ్.! నువ్వు కూడా నాకు తొందర్లోనే దొరుకుతావు రవి కానీ ఈ వీడియో చూసిన తర్వాత తనకు కూడా చాలా నవ్వు వచ్చిందంటూ” సరదాగా రిప్లై ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రవి పలు షోలు, ఈవెంట్లలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తునే మరోపక్క హీరోగా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తున్నాడు.ఆ మధ్య తెలుగు నూతన దర్శకుడు “విశ్వనాథ్ అయోధ్య కార్తీక్” దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే చిత్రంలో హీరోగా నటించాడు కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube