అమెరికా ప్రధమ మహిళకే డూప్..మరో వివాదంలో ట్రంప్..!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు.ఎలాంటి సమయం, సందర్భం అయినా సరే తాను అనుకున్న పని చేసేస్తూ వివాదాలలో చిక్కుకున్న సందర్భాలు అనేకం.

 Trump Stuck In Another Issue About Trump Wife Molaniya Doop, America, Donald Tru-TeluguStop.com

అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూడా ట్రంప్ వివాదాల చుట్టూ తిరుగుతున్నారు.తాజాగా తన సతీమణి, అమెరికా ప్రధమ మహిళకు బదులుగా అచ్చం ఆమెను పోలి ఉన్న మరొక మహిళతో ట్రంప్ తిరుగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దాంతో ప్రస్తుతం మెలానియా డూప్ వ్యవహారం అమెరికా వ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది.అసలేం జరిగిందంటే

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ తీవ్రస్థాయిలో బిజీ బిజీ గా ఉంటున్నారు.

అయితే గడించిన కొన్ని రోజులుగా ట్రంప్ ఆయన సతీమణి మెలానియాను పోలి ఉన్న మరొక మహిళను తన వెంట తిప్పుకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.దీనికి సంభందించిన సాక్ష్యాలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ట్రంప్ నాష్ విల్లెలోని ఓ యూనివర్సిటీలో ప్రసంగించడానికి వెళ్ళడానికి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ లో సిద్దమయ్యారు.ఈ క్రమంలో అభిమానులకు అభివాదం చేస్తున్న క్రమంలో ఆయన పక్కనే మెలానియా పోలికలతో ఉన్న మహిళ నిలబడి ఉన్నారు.

మెలానియా పోలికలతో ఉన్న ఆమెని చూసిన వెంటనే అందరికి అనుమానాలు రేకెత్తాయి.దాంతో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు గమనించిన వాళ్ళు ఆ ఫోటోలో ఉన్నది మెలానియా డూప్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.దాంతో ట్రంప్ పక్కనే నిలుచున్న ఆమె ఎవరు అంటూ ఫేక్ మెలానియా హాష్ ట్యాగ్ వాడుతూ హల్చల్ చేశారు.

అసలు మెలానియా కి ఏమయ్యింది.ఆమె బదులు ఈమెను ఎందుకు పక్కనే పెట్టుకున్నారని మీరు అమెరికా ప్రజలకు, ప్రపంచానికి ఏం సమాధానం చెబుతారంటూ మండిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube