అవును… మీరు చూస్తున్నది నిజమే.ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు.
స్వయంగా అక్కినేని అమల( Amala akkineni ).తన ఇద్దరు కొడుకులలో అఖిల్ చాలా అల్లరి పిల్లాడు అని నాగచైతన్య అద్భుతంగా పెరిగాడని ఆమె స్వయంగా ఒప్పుకుంటుంది.ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి బాల్యం గడిచిన తీరు, వాళ్ళు పెరిగిన విధానం కూడా ఆమె ఎంతో చక్కగా వివరించారు.ఇద్దరు పిల్లలు మాకు సమానమే అంటూ చెప్పుకొచ్చారు.
అందులో అఖిల్ ఎక్కువ నాగచైతన్య తక్కువ అని ఎప్పుడూ లేదని, తల్లి దగ్గరే ఎక్కువగా చెన్నైలో పెరిగాడు కాబట్టి కేవలం చైతు వేసవి సెలవులకు మాత్రమే హైదరాబాద్ కి వచ్చేవాడు అంటూ చెప్పారు.

చిన్నతనంలో ఎప్పుడైతే లక్ష్మీ మరియు నాగార్జున( Lakshmi ) విడాకులు తీసుకున్నారో ఆమె వెంటనే చెన్నైకి వెళ్లిపోయారట.అక్కడే కొడుకును పెంచుతూ తాను కూడా వృత్తిరీత్యా బిజీ అయిపోయారట.నాగచైతన్య పెంపకం పూర్తి బాధ్యత లక్ష్మీ మాత్రమే తీసుకున్నారట.
కాస్త పెద్ద అవుతున్న కొద్ది తండ్రి పై కూడా అతనికి హక్కు ఉంది కాబట్టి వేసవి సెలవుల కోసం మాత్రమే లక్ష్మి హైదరాబాద్ కి పంపించే వారట.

వచ్చిన రెండు నెలలు కూడా తండ్రితో చాలా సమయం గడిపే వాడట నాగచైతన్య.అంతేకాదు అఖిల్ కూడా అన్న చైతు అంటే ఎంతో అభిమానించేవాడని ఇద్దరికి వయసులో ఎనిమిదేళ్ల తేడా ఉంది కాబట్టి నాగచైతన్య ఎక్కడ ఉంటే అఖిల్ అక్కడే ఉండేవాడట.అన్న, అన్న అంటూ వెనక తోకల తిరుగుతూ ఉండేవాడట.
వారిద్దరి వేసవి సెలవులు చాలా చక్కగా గడిచేవట.

చెన్నై నుంచి నాగ చైతన్య ఎప్పుడు వస్తాడా అని అఖిల్ ఎదురు చూసేవాడట.చాలా సైలెంట్ గా ఉండే నాగ చైతన్య( Naga Chaitanya ) అస్సలు అల్లరి చేసేవాడు కాదట.లక్ష్మి నాగచైతన్య ను చాలా చక్కగా పెంచింది అని అఖిల్ కన్నా కూడా నాగ చైతన్య పెంపకం అద్భుతంగా ఉంది అంటూ అమలు చెప్పడం ఆమె మెచ్యూరిటీని చూపిస్తుంది.
ఏ తల్లి కూడా తన కుటుంబంలో ఇంకొక వ్యక్తి వస్తాడు అంటే ఒప్పుకునే రోజులు కాదు ఇవి.కానీ లక్ష్మి కొడుకు అయినప్పటికీ కూడా నాగార్జునకు కూడా కొడుకే కాబట్టి అమలు ఇద్దరు పిల్లల విషయంలో సమాన బాధ్యత ఉంటుంది అని చెబుతుంది.నిజంగా చాలా గ్రేట్ కదా !
.