బన్నీ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడుగా..     2018-06-14   01:00:04  IST  Raghu V

అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఎన్నో అంచనాల నడుమ చాలా కష్టపడి నటించిన నా పేరు సూర్య చిత్రం నిరాశ పర్చడంతో అల్లు అర్జున్‌ చాలా రోజుల తర్వాత చాలా కాలం గ్యాప్‌ తీసుకున్నాడు. తన సినిమా సినిమాకు పెద్దగా గ్యాప్‌ లేకుండా చూసుకునే అల్లు అర్జున్‌ ఈసారి మాత్రం ఇంకా తన తదుపరి చిత్రాన్ని ఫైనల్‌ చేయలేదు. నా పేరు సూర్య చిత్రం సక్సెస్‌ అయితే ఇప్పటి వరకు తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యేది. కాని పరిస్థితిు తారు మారు అయిన కారణంగా సినిమాను వాయిదా వేశారు.

విక్రమ్‌ కుమార్‌తో సినిమా ఉండదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇలాంటి సమయంలోనే అల్లు ఫ్యామిలీ నుండి ఫుల్‌ క్లారిటీతో ఒక ప్రకటన వచ్చేసింది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం విదేశాల్లో కుటుంబంతో పాటు వెకేషన్స్‌లో ఉన్నాడు, ఆయన రాగానే అంటే జులై లేదా ఆగస్టులో కొత్త సినిమా ప్రారంభం కాబోతుందని చెప్పుకొచ్చారు. హరీష్‌ శంకర్‌తో అల్లు అర్జున్‌ సినిమా అంటూ మీడియాలో వస్తున్న వార్తలను అల్లు సన్నిహితులు కొట్టి పారేశారు. సినిమా సక్సెస్‌ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బన్నీ సినిమాలు చేస్తాడు అని, సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన ముందే కమిట్‌ అయిన సినిమాను ఎందుకు నో చెబుతాడు అంటూ వారు అంటున్నారు.