బన్నీ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడుగా..

అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది.

ఎన్నో అంచనాల నడుమ చాలా కష్టపడి నటించిన నా పేరు సూర్య చిత్రం నిరాశ పర్చడంతో అల్లు అర్జున్‌ చాలా రోజుల తర్వాత చాలా కాలం గ్యాప్‌ తీసుకున్నాడు.

తన సినిమా సినిమాకు పెద్దగా గ్యాప్‌ లేకుండా చూసుకునే అల్లు అర్జున్‌ ఈసారి మాత్రం ఇంకా తన తదుపరి చిత్రాన్ని ఫైనల్‌ చేయలేదు.

నా పేరు సూర్య చిత్రం సక్సెస్‌ అయితే ఇప్పటి వరకు తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యేది.

కాని పరిస్థితిు తారు మారు అయిన కారణంగా సినిమాను వాయిదా వేశారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ విక్రమ్‌ కుమార్‌తో సినిమా ఉండదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

ఇలాంటి సమయంలోనే అల్లు ఫ్యామిలీ నుండి ఫుల్‌ క్లారిటీతో ఒక ప్రకటన వచ్చేసింది.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం విదేశాల్లో కుటుంబంతో పాటు వెకేషన్స్‌లో ఉన్నాడు, ఆయన రాగానే అంటే జులై లేదా ఆగస్టులో కొత్త సినిమా ప్రారంభం కాబోతుందని చెప్పుకొచ్చారు.

హరీష్‌ శంకర్‌తో అల్లు అర్జున్‌ సినిమా అంటూ మీడియాలో వస్తున్న వార్తలను అల్లు సన్నిహితులు కొట్టి పారేశారు.

సినిమా సక్సెస్‌ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బన్నీ సినిమాలు చేస్తాడు అని, సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన ముందే కమిట్‌ అయిన సినిమాను ఎందుకు నో చెబుతాడు అంటూ వారు అంటున్నారు.

!--nextpage అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేయడం దాదాపుగా ఖరారు అయినట్లే అంటూ తేలిపోయింది.

ఇక ఈయన తదుపరి రెండు చిత్రాలు కూడా క్లారిటీ వచ్చేశాయి.బన్నీతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ మరో సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడు.

జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలతో సక్సెస్‌లు అందుకున్న ఈ జంట త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌తో అరవింద సమేత చిత్రాన్ని చేస్తున్న త్రివిక్రమ్‌ ఆ తర్వాత బన్నీతో సినిమాను చేయబోతున్నాడు.

హ్యాట్రిక్‌ సాధించేందుకు ఈ జోడీ ఆరాటపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.విక్రమ్‌ కుమార్‌, త్రివిక్రమ్‌ల మూవీతో పాటు బన్నీ మరో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

రేసుగుర్రం వంటి బ్లాక్‌ బస్టర్‌ను తనకు ఇచ్చిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు.

ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి ‘సైరా’ చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ సినిమా పూర్తి అయిన వెంటనే బన్నీతో సినిమా చేస్తాడని తెలుస్తోంది.

మొత్తానికి వచ్చే సంవత్సరం వరకు మూడు సినిమాలతో బన్నీ బిజీగా గడుపబోతున్నాడు.ఈమూడు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాలయ్య తో కామెడీ సినిమా చేయాలనుకున్న స్టార్ డైరెక్టర్.. అది ఎలా మిస్ అయిందంటే..?