Akkineni Nageshwar Rao : భాష రాని కారణంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది : అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageshwar Rao ) గుడివాడ దగ్గరలోని రామాపురం అనే ఒక పల్లెటూర్లో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు ఐదుగురు సంతానంలో అక్కినేని ఒకడు.1924లో జన్మించిన అక్కినేని నాటక రంగంలో మొదట ప్రవేశించి ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చారు.అయితే ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకడిగా పెరిగిన అక్కినేని కి తన వాటాగా 5 ఎకరాల భూమి వచ్చిందట.25 ఎకరాల ఆసామీ అయినా వెంకటరత్నం అయిదుగురు కొడుకులకు తలో 5 ఎకరాలు చొప్పున పంచి ఇచ్చాడట.అయితే ఆ ఐదు ఎకరాలలో వ్యవసాయం చేసి బ్రతకొచ్చు లేదంటే దాని మీద వచ్చే ఆదాయంతో చదువుకొని బాగా సెటిల్ అవ్వచ్చు అని వాళ్ళ అక్కినేని గురించి అమ్మ అనుకుంటూ ఉండేవారట.

 Akkineni Emotional About Studies-TeluguStop.com
Telugu Akkineni, English, Nagarjuna, Punnamma, Venkataratnam-Telugu Top Posts

అప్పట్లో 600 రూపాయలకు ఎకరా భూమి చొప్పున అమ్మితే డబ్బులు వచ్చేవట.ఆ సమయంలో అన్ని వద్దు అనుకోని మద్రాసు రైలు ఎక్కి సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకున్నాడు అక్కినేని.ధర్మపత్ని సినిమాతో తెరంగేట్రం చేశాడు.అయితే చిన్నతనంలో తన తల్లికి అతనిపై ఎన్నో ఆశలు ఉండేవట.చదువుకోవాలని బాగా చదివి పాస్ అవ్వాలని ఆ తర్వాత ఉద్యోగం సంపాదించాలని పున్నమ్మ ( Punnamma )కు తన కొడుకు అక్కినేని గురించి కలలు కంటూ ఉండేవారట.అవేవీ నెరవేరకపోగా ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ అక్కినేని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే ఆరోజు బాగా చదువుకోకపోవడం వల్ల ఇబ్బంది అనిపించలేదు కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చదువు ఉండాల్సి ఉండేదని చాలాసార్లు అనుకున్నాడట అక్కినేని.

Telugu Akkineni, English, Nagarjuna, Punnamma, Venkataratnam-Telugu Top Posts

కొంత స్టార్ డం వచ్చిన తర్వాత భాష విషయంలో ఇబ్బందులు పడ్డాడట.భాష రాకుండా మిగతా భాషల్లో సినిమాలు తీయడం లేదా చూడడం జరిగే పని కాదు.అందుకే బాగా చదివి ఉండి ఉంటే బాగుండేదని అనుకునేవాడట.

పైగా తన తోటి నటులంతా కూడా ఇంగ్లీష్( English ) బాగా మాట్లాడుతుండడం వల్ల ఓసారి తాను మాట్లాడలేని కారణంగా అవమాన పడాల్సి వచ్చింది అంట.ఆ సందర్భంగా కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట అక్కినేని.అప్పటి నుంచి ఆయన చదువు లేకపోయినా ఇంగ్లీష్ పై పట్టు సాధించారు.అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం కూడా నేర్చుకున్నారు.తన పరిస్థితి తన పిల్లలకు రాకూడదని అందరినీ బాగా చదివించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube