టిడిపి జనసేన పొత్తు( TDP Janasena Alliance ) తర్వాత సీట్ల పంపకాల విషయంలో చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా టికెట్ ఆశించి, ఇప్పటి వరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చిన జనసేన ఆశావాహులు పొత్తులో భాగంగా టికెట్ టిడిపికి కేటాయించడం పై తీవ్ర అసంతృప్తితో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.
పైకి సఖ్యతగా ఉన్నట్టుగా రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతున్నా.
అంతర్గతంగా చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది.ఈ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా జ్యోతుల నెహ్రూ ను( Jyothula Nehru ) టిడిపి అధిష్టానం కేటాయించింది.
పొత్తులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం టికెట్ టిడిపికి ఇవ్వడం పై ఆగ్రహానికి గురైన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్రరావు( Patamsetti Suryachandra Rao ) ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన పాఠం శెట్టి సూర్యచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇంటింటికి ఓటేసి పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) గెలిపించమని ఎనిమిది సార్లు నియోజకవర్గ మొత్తం జనసైనికులు అంతా కలిసి తిరిగామని , కానీ నియోజకవర్గ సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారని దీనిపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే తమ ప్రాణాలు ఉంటాయని,
లేకపోతే తమ ప్రాణాలు ఉండవని పాఠం శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు సీటు ఇవ్వమని తాను చెప్పట్లేదని, మీరు పోటీ చేయాలని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామంటూ పవన్ ను కోరారు ఇక్కడ పోటీ చేస్తే పవన్ మాత్రమే పోటీ చేయాలని, అంతేకానీ జ్యోతుల నెహ్రూను మాత్రం గెలవనివ్వమని పవన్ స్పందించే వరకు తమ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని పాఠం శెట్టి సూర్యచంద్రరావు వ్యాఖ్యానించారు.