బాపట్ల జిల్లా అద్దంకి మాజీ వైసీపీ ఇంఛార్జ్ కృష్ణచైతన్య( Ex-YCP In-Charge Krishna Chaitanya ) గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ మేరకు కృష్ణ చైతన్యకు చెందిన ఆర్న్ క్వారీలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
సంతమాగులూరు మండలం మల్లాయపాలెం క్వారీలో తనిఖీలు చేసిన మైనింగ్ అధికారులు( Mining Officials ) రికార్డులను విస్తృతంగా పరిశీలించారు.
అయితే ఇటీవలే కృష్ణ చైతన్యను వైసీపీ అధిష్టానం అద్దంకి నియోజకవర్గ( Addanki Constituency ) ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది.దీంతో అసంతృప్తిగా ఉన్న కృష్ణ చైతన్య పార్టీని మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ నేపథ్యంలో రాజకీయ జోక్యంతోనే మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.