సినీనటి పూర్ణ( Purna ) ప్రస్తుతం ఒకవైపు తన కెరియర్ కొనసాగిస్తూనే మరోవైపు తనవైవహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఈమె గత ఏడాది జూన్ నెలలో దుబాయ్ కి చెందిన మహమ్మద్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
కొన్ని కారణాలవల్ల పూర్ణ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.ఇక పెళ్లయిన తర్వాత తన భర్త అనుమతితో ఈమె తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
తాజాగా ఈమె ఢీ( Dhee Dance Show ) కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా పూర్ణ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూర్ణ గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటివరకు తన కొడుకుకు సంబంధించిన ఫోటోలను ఈమె అభిమానులతో పంచుకున్నారు.అయితే తాజాగా మరోసారి తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా( Social medai)లో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.దీంతో పూర్ణ కుమారుడు చాలా క్యూట్ గా ఉన్నారని,చాలా ముద్దొస్తున్నారు అంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
పూర్ణ తన కుమారుడికి హమ్దాన్ అసిఫ్ అలీ అని నామకరణం చేశారు.
తాజాగా పూర్ణ తన భర్తతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.ఈ వివాహ వేడుకల్లో భాగంగా దిగిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలలో తన కుమారుడు చాలా చూడముచ్చటగా ముద్దుగా ఉండడంతో అభిమానులు సో క్యూట్ అంటూ పెద్ద ఎత్తున చిన్నారి అందంపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక పూర్ణ సినిమాల విషయానికొస్తే ఈమె చివరిగా నాని హీరోగా నటించిన దసరా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.