నేను డిప్రెషన్ కి గురయ్యానని చెప్పిన మెహరీన్

డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణం అయ్యింది.చాలా మంది యువత డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

 Actress Mehreen Pirzada Faced Depression, Tollywood, Telugu Cinema, Mental Stres-TeluguStop.com

మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.మానసిక కృంగుబాటు అనేది ప్రస్తుతం సమాజంలో పెద్ద సమస్యగా మారింది.

ఇండియాలో మానసిక కృంగుబాటుతో చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా ఉన్నవారు కూడా ఈ మానసిక ఒత్తిడి, కృంగుబాటు కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు.

వారిలో సిల్క్ స్మిత నుంచి తీసుకుంటే ఉదయ్ కిరణ్, ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వరకు చాలా మంది కనిపిస్తారు.ఈ డిప్రెషన్ కి చాలా కారణాలు ఉంటాయి.

వ్యక్తిగత జీవితం సాఫీగా లేకపోవడం, కెరియర్ పరంగా అవకాశాలు లేకపోవడం వంటివి కనిపిస్తాయి.ఆ సమయంలో వచ్చే ఒత్తిడిని చాలా మంది తట్టుకోలేరు.

ఈ మధ్యకాలంలో ఈ డిప్రెషన్ గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది.

ఈ నేపధ్యంలో తాజాగా హీరోయిన్ మెహరీన్ కూడా ఈ విషయంపై స్పందించింది.

తాను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను అంటూ కామెంట్స్ కూడా చేసింది.జీవితంలో ప్రతీ ఒక్కరు కొన్ని సందర్భాల వల్ల డిప్రెషన్ కు లోనవుతుంటారు.

నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను.అయితే దాని నుండీ ఎంత త్వరగా బయటపడ్డామన్నదే చాలా ముఖ్యం.

దాని నుంచి బయటపడాలంటే ముందుగా మనల్ని మనం నమ్మాలి, అలాగే దేవుడ్ని కూడా నమ్మాలి.అందరికీ జీవితం ఒక్కటే అది చాలా అందమైనదని గుర్తుంచుకోవాలి.

ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలి.ఇవి పాటిస్తేనే డిప్రెషన్ నుండీ త్వరగా బయటపడగలము.

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మానవ జాతి మొత్తం డిప్రెషన్ ను ఫేస్ చేస్తుందన్న నిజాన్ని కూడా అందరూ గుర్తించాలి అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube