Malavika Mohan : ఎవరైనా వచ్చి నా చేయి పట్టుకోండి.. వైరల్ అవుతున్న హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మాళవిక మోహన్( Malavika mohan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా ఈ ముద్దుగుమ్మ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పట్టం పోలే అనే మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.

 Actress Malavika Mohan Post Is Going Viral On Social Media-TeluguStop.com

తర్వాత మలయాళంతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటించింది.మొదట మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన మాళవిక తరువాత హీరోయిగా మారారు.

రజనీకాంత్ సినిమా పేటలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మాస్టర్‌లో విజయ్‌కి, మారన్‌లో దనుష్‌కి జోడిగా నటించారు.

ప్రస్తుతం విక్రమ్‌కి జోడిగా తంగలాన్ సినిమా( Thangalaan )లో నటిస్తున్నారు.

Telugu Kollywood, Malavika Mohan, Thangalaan, Tollywood, Vikram-Movie

కాగా మాళవిక మోహన్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.తరచూ ఏదో ఒక విషయంతో మాళవిక మోహన్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా మాళవిక మోహన్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఆ పోస్ట్ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది.

Telugu Kollywood, Malavika Mohan, Thangalaan, Tollywood, Vikram-Movie

సినిమా నిర్మాణంలో తనను అత్యంత భయపెట్టే అంశం డబ్బింగ్ అని.తను డబ్బింగ్ చెప్పేటపుడు ఎవరైనా వచ్చిన తన చేయి పట్టుకుంటారా? అని అడుగుతూ పోస్టు పెట్టారు.మాళవిక చేసిన పోస్ట్ సోషల్ మీడియా( Social media ) లో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజెన్స్ నేను అంటే నేను అన్నట్టుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే మాళవిక విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.అందులో భాగంగానే మాళవిక నటిస్తున్న తంగలాన్ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube