Malavika Mohan : ఎవరైనా వచ్చి నా చేయి పట్టుకోండి.. వైరల్ అవుతున్న హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మాళవిక మోహన్( Malavika Mohan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
కాగా ఈ ముద్దుగుమ్మ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పట్టం పోలే అనే మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.
తర్వాత మలయాళంతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటించింది.మొదట మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన మాళవిక తరువాత హీరోయిగా మారారు.
రజనీకాంత్ సినిమా పేటలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మాస్టర్‌లో విజయ్‌కి, మారన్‌లో దనుష్‌కి జోడిగా నటించారు.
ప్రస్తుతం విక్రమ్‌కి జోడిగా తంగలాన్ సినిమా( Thangalaan )లో నటిస్తున్నారు. """/" /
కాగా మాళవిక మోహన్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
తరచూ ఏదో ఒక విషయంతో మాళవిక మోహన్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా మాళవిక మోహన్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఆ పోస్ట్ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. """/" /
సినిమా నిర్మాణంలో తనను అత్యంత భయపెట్టే అంశం డబ్బింగ్ అని.
తను డబ్బింగ్ చెప్పేటపుడు ఎవరైనా వచ్చిన తన చేయి పట్టుకుంటారా? అని అడుగుతూ పోస్టు పెట్టారు.
మాళవిక చేసిన పోస్ట్ సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజెన్స్ నేను అంటే నేను అన్నట్టుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే మాళవిక విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
అందులో భాగంగానే మాళవిక నటిస్తున్న తంగలాన్ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.
కాఫీ డార్క్ సర్కిల్స్ ను పొగొడుతుందా?