జాతి వ్యతిరేక వ్యాఖ్యలు... తిట్ల పురాణం : భారతీయ నటికి ఆస్ట్రేలియాలో అవమానం

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్ష ఉద్యమం తీవ్రంగా నడుస్తోంది.విద్య, ఉపాధి, వ్యాపారంతో పాటు పర్యటనల కోసం వివిధ దేశాలకు వెళ్లిన ఎంతో మంది భారతీయులు జాతి వివక్షను ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు.

 Chandni Bhagwanani Shares Racist Attack In Melbourne, Actress Chandni Bhagwanani-TeluguStop.com

జాతిపిత మహాత్మాగాంధీ నుంచి నేటి అమితాబ్ బచ్చన్ వరకు ప్రముఖులకు సైతం ఈ ఇబ్బందులు తప్పలేదు.తాజాగా మనదేశానికి చెందిన ఓ సినీనటి ఆస్ట్రేలియా పర్యటనలో జాతి వివక్షకు గురయ్యారు.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

సంజీవని వెబ్‌ సిరీస్‌ ద్వారా బాగా పాపులర్ అయిన చాందినీ భగ్వానాని.

తెలుగులో వచ్చిన దిక్సూచి సినిమాలోనూ నటించారు.ఈమె కొన్ని ప్రోగ్రాముల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు.

అక్కడి మెల్‌బోర్న్ నగరంలో ఉంటూ పనులు చూసుకుంటున్నారు.అయితే లాక్‌డౌన్ కారణంగా ఆమె అక్కడే చిక్కుకుపోయింది.

అయితే కొత్త ప్రాంతం కావడంతో ఏమీ తెలియవు కాబట్టి.కంగారు పడిందంట.

ఈ క్రమంలో ఒకసారి మెల్‌బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.అక్కడికి వెళ్లడం ఆమెకు అదే తొలిసారి.బస్సు చాలా మలుపులు తీసుకుంటూ వెళ్తోంది.దీంతో చాందినీకి వెళ్లాల్సిన ప్రాంతం తెలియక కంగారు పడింది.

ఏం చేయాలో తెలియాక డ్రైవర్ దగ్గరకు వెళ్లి.తాను వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్తుందా.? అని అడిగిందట.అయితే అతను సరిగా సమాధానం ఇవ్వలేదు.

తర్వాత తోటి ప్రయాణికులను అడగ్గా.వారు కూడా రెస్పాండవ్వలేదట.

దీంతో మరింత కంగారు పడిన చాందిని మరోసారి కొంత కోపంతో వివరాలు అడిగింది.దీనికి ఆ డ్రైవర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.కోపంతో కసురుగా ఆమెను వెళ్లిపోమ్మని హెచ్చరించాడు.తాను చాలా మర్యాదగా అడిగాను కానీ అతడు వెళ్లిపొమ్మంటూ అరుస్తూనే ఉన్నాడని చాందిని చెప్పింది.

ఈ సందర్భంగా చెత్త భారతీయుల్లారా… ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అని తిట్ల పురాణం అందుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.ఈ ఘటనతో తాను వణికిపోయానని .చేసేది లేక బస్సు దిగిపోయానని వివరించింది.సమాజంలో జాతి వివక్ష ఇంకా ఉందనడానికి తనకు జరిగిన అనుభవమే ఉదాహరణ అని చాందిని వాపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube