ఏ రాష్ట్రంలో ఏ అత్త గారు అల్లుడుకు ఎంత మర్యాద చేస్తారో తెలియదు కానీ ఆంధ్ర అత్త మాత్రం తన అల్లుడికి ఓ రేంజ్ లో మర్యాద చేసింది.ఆ మర్యాద చూస్తే మాకు ఇలాంటి అత్తగారు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది.
ఆ రేంజ్ లో ఆ అత్తగారు మర్యాద చేశారు. ఏం చేశారు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.
ఆంధ్ర అత్తగారు తమ అల్లుడి కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 రకాల వంటకాలు తయారు చేసి పెట్టింది.కేకు కటింగ్ నుండి చాట్, స్వీట్లు నుంచి పులిహోరా తదితర రకాల వంటకాలను తయారు చేశారు.
ఇంకా అన్ని చేసిన ఆమె అన్ని రకాల వంటకాలను వివరిస్తూ వీడియో తీసింది.ఇంకా ఈ వీడియో చూస్తే నోరూ ఊరుతుంది అంటే నమ్మండి.
ఇంకా అలా వివరించిన ఆ వీడియోను అనంత్ రూపంగుడి అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.దీంతో ఆమె చేసిన వంటకాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఆ వీడియోను చూసి కొందరు నోరు ఊరుతుంది అని అంటుంటే మరి కొందరు.మీ అల్లుడు ఈ వంటకాలు అన్ని తినగలడా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.మరి కొందరు అయితే ఆమెను ఏకంగా.”మదర్-ఇన్-లా ఆఫ్ ఇండియా” అంటూ పొగిడేస్తున్నారు.మరి ఈ వీడియోను చూసి మీరేం అనుకుంటున్నారో కామెంట్ పెట్టండి.