నన్ను మళ్లి బలిపీఠం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు - నటి భావన

ఇండస్ట్రీ అంటే ఎదో ఒక పంచాయితీ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది.అందులో ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ అయినటువంటి సినిమా, టీవీ రంగాల్లో చాలా కామన్.

 Actress Bhavan Is Under Social Media Trolling Details, Actress Bhavana, Heroine-TeluguStop.com

ఇలాంటి పరిస్థితులలో రెండు వర్గాలుగా విడిపోయి ఉంటారు.అభిమానులు సైతం రెండు పక్షాలుగా మారిపోయి ఒకరి పై ఒకరు కారాలు మిర్యాలు నూరుకుంటూ ఉంటారు.

ఇలాంటి పంచాయితీలు కేరళ లో మరికొంత ఎక్కువ అనే చెప్పాలి.కొన్నేళ్ల క్రితం ఒక హీరోయిన్ పై జరిగిన లైంగిక దాడి కూడా మీ అందరికి గుర్తుండే ఉంటుంది.అదేనండి… హీరోయిన్ భావన పై కొందరు దుండగులు కారులో ఎక్కి అసభ్యం గా ప్రవర్తించిన తీరు అందరికి షాక్ కి గురి చేసింది.ఈ కేసులో ప్రముఖ హీరో దిలీప్ ప్రమేయం ఉందని పలు సెక్షన్స్ గట్టిగానే పెట్టి బెయిల్ కూడా రాకుండా జైలులో పెట్టారు.

 Actress Bhavan Is Under Social Media Trolling Details, Actress Bhavana, Heroine-TeluguStop.com

ఈ కేసు జరుగుతున్నన్ని రోజులు కేరళలో హీరో దిలీప్ అభిమానుల ఆగడాలు శృతిమించిపోయాయి.హీరోయిన్ భావన పై దారుణంగా మాటల దాడి చేసారు.కారులో భావనపై జరిగిన దాడి కంటే కూడా దిలీప్ ఫ్యాన్స్ చేసిన మాట దాడితో తీవ్రంగా గాయపడింది భావన.ఆ తర్వాత నుంచి మలయాళ సినిమాల్లో నేటి వరకు ఆమెను నటించలేదు.

కేవలం కన్నడ సినిమాలోని నటిస్తూ వస్తోంది తెలుగులో సైతం కొన్ని సినిమాల్లో నటించింది.ఒంటరి, మహాత్మా, హీరో వంటి సినిమాల్లో తలుక్కున మెరిసింది భావన.

ఇప్పుడు మళ్లీ మలయాళ సినిమా పరిశ్రమలో భావన తగాదా తెరమీదకు వచ్చింది ఇన్నేళ్ల తర్వాత ఆమె తాజాగా ఓ మలయాళ సినిమా ఒప్పుకొని అందులో నటిస్తోంది.ఇందులో వివాదం ఏముంది అనుకుంటున్నారు కదా అసలు సమస్య అక్కడే వచ్చింది.

Telugu Actress Bhavana, Bhavana Offers, Dileep, Dileep Fans, Bhavana, Bhavana Tr

ఇటీవలే దుబాయ్ గోల్డెన్ వీసా తీసుకోవడానికి వెళ్ళింది భావన.అక్కడ వేసుకున్న డ్రెస్ కాస్త అసభ్యంగా ఉండడంతో మరోసారి ట్రోలింగ్ బారిన పడింది.ఇక దొరికిందే అవకాశం అన్నట్టుగా దిలీప్ ఫ్యాన్స్ రెచ్చిపోయి ఆమె పై మాటల యుద్ధం మొదలుపెట్టారు.ఆమె వివరణ ఇచ్చినా కూడా ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారలేదు.ఇప్పుడు సోషల్ మీడియా భావన సానుభూతి పరులతో అలాగే వ్యతిరేక పరులతో నిండిపోయి కామెంట్స్ యుద్ధం చేసుకుంటున్నారు.మరి ఈ తగాదా మళ్ళీ ఎక్కడికి లాగుతుందో తెలియదు కానీ నన్ను మళ్ళీ ఆ మురికి కోపంలోకి దించాలనే ప్రయత్నం చేస్తుందంటూ, పాత చీకటి రోజులకి నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ భావన బాధపడుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube