ప్రముఖ టాలీవుడ్ నటుడు కిరిటీ దామరాజు( Kiriti Damaraju ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా కిరీటి దామరాజు తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కిరీటి దామరాజు మాట్లాడుతూ నాని బిహేవియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్ షో సీజన్2( Bigg Boss Show Season 2 ) లో పాల్గొన్న కిరీటి దామరాజు ఈ షో ద్వారా నెగిటివ్ అయ్యారు.
సెకండ్ హ్యాండ్ అనే సినిమా ఫస్ట్ మూవీ అని కిరీటి దామరాజు కామెంట్లు చేశారు.ఉయ్యాల జంపాల సినిమా ఎంతోమందికి మంచి పేరును తెచ్చిపెట్టిందని కిరీటి దామరాజు అన్నారు.
నేను ఎవరినీ సినిమా ఆఫర్లు అడగలేదని ఆయన కామెంట్లు చేశారు.చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో నటించాలని నా కోరిక అని కిరీటి అన్నారు.
బిగ్ బాస్ తర్వాత కొంచెం డిప్రెషన్ ఫేజ్ లో ఉండిపోయానని కిరిటి చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్ పరంగా కోరుకున్న సక్సెస్ ను సొంతం చేసుకున్నానని కిరీటి కామెంట్లు చేశారు.ట్యాక్సీవాలాలో నా రోల్ డాక్టర్ రోల్ అని ఆ సినిమా మంచి సక్సెస్ సాధించిందని కిరీటి చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ ను ఒక గేమ్ లానే చూడాలని ఆయన తెలిపారు.
బిగ్ బాస్ షో సమయంలో కౌశల్ ఆర్మీ నా విషయంలో క్రూరమైన పాపం చేసినట్టు వ్యవహరించిందని కిరీటి తెలిపారు.
నానిగారికి నేను అపార్థం చేసుకునే స్కోప్ ఇచ్చానని అనిపించిందని కిరీటి అన్నారు.ఇదే విషయం నానిగారితో నేను ఎప్పుడూ చర్చించలేదని ఆయన అన్నారు.నాని బిగ్ బాస్ షో గురించి చెబితే ఛల్ అని అంటాడని కిరీటి కామెంట్లు చేశారు.
కిరీటి దామరాజు వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.