అతడు చెట్టు కనిపిస్తే చాలు దేవుడి ఫొటోలతో ఆ చెట్టును నింపేస్తాడు.అతడు మాత్రమే కాదు అక్కడ ఉన్న వారితో కూడా ఇలానే చేయిస్తున్నాడు.
అక్కడ ఉన్న చెట్లను మొత్తం దేవుడి ఫోటోలను అతికిస్తున్నాడు.ఎందుకు అలా కనపడిన చెట్లను మొత్తం దేవుడి ఫొటోలతో నింపేస్తున్నావ్ అని అడిగితే అందుకు ఒక కారణం చెబుతున్నాడు.
ఆ కారణం వింటే మనం ఆశ్చర్య పోవాల్సిందే.
అతడు దేవుడి ఫోటోలను అతికించడం చుసి ఎవరైనా ఎందుకు అలా చేస్తున్నావని అడిగితే వాళ్ళ చేత కూడా ఆ ఫోటోలను అతికించేస్తున్నాడు.
అయితే అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలిసాక జనం కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ దేవుడి బొమ్మలను కనపడిన చెట్లకు అంటిస్తున్నారు.ఇంతకీ అతడు ఇలా చేయడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారా.
అతడి పేరు వీరేంద్ర సింగ్.అతడు ఛతీస్ఘడ్ కు చెందిన వాడు.
అతడు ఉండే దగ్గర ఏ చెట్టు కనిపించినా ఇలానే దేవుడి ఫోటోలను అతికిస్తూ ఉంటాడు.మొదట్లో అక్కడ ఉండే వారికి అతడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాలేదు.
కానీ ఆ తర్వాత అతడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అక్కడ ఉన్న వారికీ చెప్పడంతో వారు కూడా ఇందులో భాగం అయ్యారు.
అతడు కనపడిన చెట్లకల్లా ఎందుకు దేవుడి ఫోటోలు అతికిస్తున్నాడో అని అడిగితే.
అతడు పర్యావరణం కాపాడడం కోసం అని సమాధానం చెప్పడంతో అందరు ఆశ్చర్య పోయారు.దేవుడి ఫోటోలు పెట్టడానికి పర్యావరణం కాపాడడానికి లింక్ ఏంటా అని అనుకుంటున్నారా.
అలా చెట్లకు దేవుడి ఫోటోలను పెడితే దేవుడు మీద ఉన్న భక్తితో ఆ చెట్లను ఎవ్వరు నరికరు అని అతడి ఉద్దేశం.
మరో కారణం కూడా ఉందట.అక్కడ దగ్గర్లో రోడ్డు వేసేందుకు గాను సుమారు 20 వేల చెట్లను నరికారట.అది దృష్టిలో పెట్టుకుని చెట్లను విపరీతంగా నరికితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఇలా చేస్తున్నాడని ఆయన చెబుతున్నాడు.
అవును కదా చెట్లు లేకపోతే పర్యావరణానికి పెద్ద ముప్పే.